Video: ‘ఇది నా గ్రౌండ్ రా భయ్’.. కేఎల్ రాహుల్‌ను ఆటపట్టించిన కింగ్ కోహ్లీ.. వీడియో చూశారా?
This Is My Ground Celebrations: నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదట్లో తడబడిన ఆర్‌సీబీ.. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51 పరుగులు, కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 పరుగులు)తో కలిసి నాల్గవ వికెట్‌కు 119 పరుగుల కీలక భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు.

This Is My Ground Celebrations: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు మొదట్లో తడబడినా.. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51 పరుగులు, కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 పరుగులు)తో కలిసి నాల్గవ వికెట్‌కు 119 పరుగుల కీలక భాగస్వామ్యంతో విజయాన్ని అందించారు. క్రీజులో ఉన్న సమయంలో, కోహ్లీ 4 ఫోర్లు బాదాడు. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ ఏడవ విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ ఢిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను ‘ఇది నా మైదానం’ వేడుకతో ఆటపట్టించాడు.
DC vs RCB మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, కోహ్లీ రాహుల్‌తో మాట్లాడుతున్న సమయంలో ఈ వేడుకను దింపేశాడు.
ఏప్రిల్ 10న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఢిల్లీ, చెన్నై మ్యాచ్ తర్వాత, రాహుల్ ‘ఇది నా మైదానం’ అంటూ సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
kohli😂❤️🫶🏻 https://t.co/7Nx1wejHw8 pic.twitter.com/otniekWn7Y
— S A K T H I ! (@Classic82atMCG_) April 27, 2025
ఆదివారం ఢిల్లీలో జరిగిన 51 పరుగుల ఇన్నింగ్స్ కోహ్లీ ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని సంపాదించాడు. ఈ సంవత్సరం ఆర్‌సీబీ తరపున 10 మ్యాచ్‌ల్లో, కోహ్లీ ఆరు అర్ధ సెంచరీల సహాయంతో 443 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ లీడర్‌బోర్డ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కోహ్లీ తర్వాత స్థానంలో ఉన్నాడు. ముంబై తరపున 10 మ్యాచ్‌ల్లో సూర్య మొత్తం 427 పరుగులు చేశాడు.
అగ్రస్థానంలో ఆర్‌సీబీ..
ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. బెంగళూరు 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లను కలిగి ఉంది. రజత్ పాటిదార్ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం ఒకదానినైనా గెలిస్తే, వరుసగా రెండవ సీజన్‌కు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఖాయం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








