AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Team: భారత క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్..

అస్ట్రేలియాలో నెల రోజుల పాటు జరిగిన ఐఐసీ టీ20 ప్రపంచకప్ 2022 అదివారం ముగిసింది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్టుల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ..

T20 World Cup Team: భారత క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్..
Team Of The Tournment Icc
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 14, 2022 | 1:21 PM

Share

అస్ట్రేలియాలో నెల రోజుల పాటు జరిగిన ఐఐసీ టీ20 ప్రపంచకప్ 2022 అదివారం ముగిసింది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్టుల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ అధ్యాయానికి తెరపడింది. అందరూ చూస్తుండగానే మరో ఐసీసీ టోర్నమెంట్ కప్‌ను ఇంగ్లాండు తన ఖాతాలోకి చేర్చుకుంది.  ఇప్పడు ఇంగ్లీష్ జట్టు వద్దనే ఐఐసీ వన్డే ప్రపంచకప్ 2019, ఐఐసీ టీ20 ప్రపంచకప్ 2022 ఉండడం చెప్పుకోదగిన విషయం. ఆదివారం టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ కూడా అయిపోవడంతో ఐఐసీ సోమవారం ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ను ప్రకటించింది. ఈ టీమ్‌లో మొత్తంగా 12 మంది సభ్యులు ఉండగా.. వారిలో టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండు జట్టు నుంచి నలుగురు ఉన్నారు. ఇంకా పాకిస్థాన్ నుంచి ఇద్దరు, దక్షినాఫ్రికా, న్యూజిలాండ్, జింబాబ్వే జట్టుల నుంచి ఒక్కొక్కరుగా ఉన్నారు. ఇక మిగిలిన ముగ్గురు భారత్‌కు చెందినవారు కావడం విశేషం.

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ టోర్నమెంట్‌లో ముందు నుంచే మెరుపులు మెరిపిస్తూ అందరినీ అలరించారు. కోహ్లీ అయితే 296 పరుగులు చేసి క్రికెట్ అభిమానులను తన ఆటతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా టోర్నమెంట్‌లో నాలుగు అర్థ సెంచరీలు, అత్యధిక పరుగులు 82* (పాక్ మీద) , ఇంకా తన యావరేజ్ 98.66 గా ఉండడం కూడా గమనార్హం. సూర్యకుమార్ యాదవ్ కూడా టోర్నమెంట్ ఆద్యంతం తన బ్యాంటింగ్ స్టైల్‌తో ఆకర్షించాడు. మొత్తం మీద 239 పరుగులు చేయడమే కాక అతని స్ర్టైక్ రేట్ ఏకంగా 189.68 గా ఉంది. ఇక ఐఐసీ టీ20 ప్రపంచకప్ జట్టులో 12వ సభ్యుడిగా స్థానం పొందిన అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. మొత్తం 6 మ్యాచ్‌లలో 8 కీలక వికెట్లను పడగొట్టడమే కాక ఈ టోర్నమెంటులో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్

అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్  రజా, శదాద్ ఖాన్, సామ్ కర్రన్, ఎన్రిచ్ నోర్ట్‌జే, మార్క్ వుడ్, షాహీన్ అఫ్రిదీ, హార్దిక్ పాండ్యా

బ్యాడ్ న్యూస్

భారత జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లుగా పలు వార్తా కథానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రానున్న ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో కనపడకపోవచ్చు. బహుశా టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనలే వారికి పొట్టి ఫార్మాట్‌లోని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా కావచ్చని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

గుడ్ న్యూస్

టీ20 ప్రపంచకప్ మన చేతి నుంచి చేజారిపోయినా.. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా జట్టు సభ్యులుగా ఉన్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం.