IND vs AUS: కోహ్లీ @ 102.. అడిలైడ్‌లో రన్ మెషీన్ సరికొత్త చరిత్ర.. ప్రమాదంలో లారా ప్రపంచ రికార్డ్

Virat Kohli: కోహ్లీ 143 బంతుల్లో సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులో 23 పరుగులు చేయడం ద్వారా పింక్ బాల్ టెస్టులో తొలి భారత ఆటగాడిగా రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే, అడిలైడ్ ఓవల్‌లో విదేశీ ఆటగాడిగా అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

IND vs AUS: కోహ్లీ @ 102.. అడిలైడ్‌లో రన్ మెషీన్ సరికొత్త చరిత్ర.. ప్రమాదంలో లారా ప్రపంచ రికార్డ్
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Nov 30, 2024 | 4:24 PM

Virat Kohli: ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ విజయంతో ప్రారంభించింది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 295 పరుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో 30వ టెస్టు సెంచరీ నమోదు చేయడంతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతను డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్‌లో డే-నైట్ టెస్ట్‌లో కీలకంగా మారనున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ భారీ రికార్డు సాధించేందుకు చేరువలో ఉన్నాడు.

పింక్-బాల్ టెస్ట్‌లో మరో 23 పరుగులు చేస్తే.. డే-నైట్ టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ మారనున్నాడు. దీంతో పింక్ బాల్ టెస్టులో 300 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 277 పరుగులతో నిలిచాడు.

పింక్ బాల్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

విరాట్ కోహ్లీ – 277

రోహిత్ శర్మ – 173

శ్రేయాస్ అయ్యర్ – 155

రెండో టెస్టులో మరో 102 పరుగులు చేస్తే 611 పరుగులతో పాటు ఈ మైదానంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడు బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. గ్రేట్ బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న 552 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలంటే అతనికి ఇంకా 44 పరుగులు కావాల్సి ఉంది.

అడిలైడ్ ఓవల్‌లో టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్లు:

బ్రియాన్ లారా – 610

సర్ వివియన్ రిచర్డ్స్ – 552

విరాట్ కోహ్లీ – 509

వాలీ హమ్మండ్ – 482

లియోనార్డ్ హట్టన్ – 456

అడిలైడ్‌లో జరిగే టెస్టులో టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా , ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..