T20 World Cup: మా కలను సాకారం చేసుకోలేకపోయాం.. బాధగా ఉంది.. టీమిండియా నిష్ర్కమణపై కోహ్లీ ఎమోషనల్
మెగా టోర్నీ నుంచి ఇంటి దారి పట్టిన టీమిండియాపై అభిమానులు, మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టును ప్రక్షాళన చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టోర్నీలో ఓటమిపై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
కోట్లాది మంది అభిమానులను నిరాశలో ముంచుతూ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఇంటిదారి పట్టింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌ను అందుకున్నామన్న భారత జట్టు ఆశ తీరలేదు. ఇక మెగా టోర్నీ నుంచి ఇంటి దారి పట్టిన టీమిండియాపై అభిమానులు, మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జట్టును ప్రక్షాళన చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టోర్నీలో ఓటమిపై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మా కలను నెరవేర్చుకోకుండానే ఆస్ట్రేలియాను వీడుతున్నందుకు బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశాడు. ‘మా కలను సాకారం చేసుకోకుండానే ఆస్ట్రేలియాను వీడాల్సి వస్తోంది. ఇందుకు మేము చాలా బాధపడుతున్నాం, అయితే ఎన్నో మరుపురాని జ్ణాపకాలను మా వెంట తీసుకువస్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. టీ20 ప్రపంచకప్ లో మాకు మద్దుతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులందరికీ ధన్యవాదాలు. టీమిండియా జెర్సీ ధరించి, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తాను’ అని రాసుకొచ్చాడు కోహ్లీ.
కాగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో టీమిండియా విఫలమైనా విరాట్ అద్భుతంగా రాణించాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు కోహ్లి సాధించాడు. అదే విధంగా ఈ టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా కూడా కోహ్లి(296)నే కొనసాగుతున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం కూడా అతనికే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడాలంటే అది కోహ్లి, సూర్యకుమార్‌లు మాత్రమే. వీరిద్దరు మినహా మరెవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిల్‌లు సాధించిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్‌గానూ పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..