MS Dhoni: ప్రపంచంలో ఆ ఘనతను దక్కించుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ.. నీ శకం అద్భుతం అంటూ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్

2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిన తర్వాత క్రికెట్ ప్రేమికులకు వెంటనే ధోనీ మళ్లీ గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ధోనీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో అందించిన విజయాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

MS Dhoni: ప్రపంచంలో ఆ ఘనతను దక్కించుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ.. నీ శకం అద్భుతం అంటూ గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్
ms-dhoni-record-9-win-in-icc-knockouts
Follow us

|

Updated on: Nov 11, 2022 | 1:49 PM

మరో ఐసీసీ ట్రోఫీ కోసం కన్నేసిన భారత్ జట్టుకు నిరాశ ఎదురైంది. టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఘోరం పరాజయాన్ని పొందింది. అయితే భారత్ క్రికెట్ జట్టు ఇలా ఓడిపోవడం ఫస్ట్ టైం కాదు. 2013 తర్వాత ఐసీసీ టోర్నీల్లో భారత ఇదే విధంగా ప్రయాణిస్తోంది. టీ 20 వరల్డ్ కప్ 2022 సెమీ-ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమి నుంచి  క్రికెట్ ప్రేమికులు మాత్రమే కాదు.. ప్రేక్షకుల మదినుంచి మరపుకు రావడం లేదు. ఎందుకంటే ఆటలో గెలుపు ఓటమిలు సర్వసాధారణం.. అయితే భారత జట్టు ఓడిన విధానం మాత్రం సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ నిరాశకు గురిచేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు చాలామంది ఫ్యాన్స్ మనం ఎందుకు గెలవలేదు అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు… ఆ ప్రశ్నకు సమాధానంగా ఎంఎస్ ధోని లేడు  కనుక గెలవలేదు అనే సమాధానాన్ని తనకు తానే చెప్పుకుంటున్నాడు. అవును అదే ఐసీసీ మైదానంలో  T20 వరల్డ్ కప్ 2022 సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ధోని మళ్లీ గుర్తుకొచ్చాడు. కూడా రావాలి. ఎందుకంటే ధోనీ క్రికెట్ జట్టుకి కెప్టెన్ గా ఉన్న సమయంలో అందిన విజయాలు.. ఇప్పుడు అందుకోవడం లేదు. గత ఐసీసీ ట్రోఫీని భారత జట్టు ఖాతాలో పడిన సమయంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటి నుంచి అంటే గత 9 సంవత్సరాలుగా ఐసీసీ ట్రోఫీకోసం భారత్ జట్టు వేచి చూస్తూనే ఉంది.

ఒక వ్యక్తి దగ్గర లేనప్పుడే అతని విలువ తెలుస్తుందని ఎవరో సరిగ్గా చెప్పారు. ప్రస్తుతం టీమ్ ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో భారత్‌ను విజయపథంలో నడిపిస్తూ ధోని ఐసిసి ట్రోఫీలను ఒకదాని తర్వాత మరొకటిగా భారత్ ఖాతాలో వేస్తున్నప్పుడు.. చాలామంది అది ధోని లక్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అంతేకాదు కొందరి జోక్ లా కూడా తీసుకున్నారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్.. ఆ తర్వాత మరే ఐసీసీ టోర్నీని అందుకోలేకపోయింది. అప్పటి నుంచి భారత జట్టు అద్భుతంగా రాణించి నాకౌట్స్ చేరినా తర్వాత బొక్కబోర్లా పడిపోవడం ఆనవాయితీగా మారింది. దీంతో భారత జట్టుకు తన తెలివైన వ్యూహాలతో మరపురాని విజయాలు అందించింది కెప్టెన్ ఎస్ ధోనీ మాత్రమే అని క్రికెట్ ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ధోనీ శకం 2013తో అంతమైందనే అని అంటున్నారు.

ధోనీ ఎందుకు గుర్తుకొస్తున్నాడంటే: MS ధోని ఎందుకు గుర్తుకు వస్తున్నాడంటే.. గణాంకాలపై ఓ లుక్ వేయాల్సిందే. ధోనీ సారథ్యంలో భారత్ 12 ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 9 విజయాలు సాధించింది.  అదే సమయంలో  భారత కెప్టెన్లగా ధోనీ మినహా ఇతరుల నాయకత్వంలో ఆడిన 19 నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ 9 మాత్రమే గెలిచింది. ఐసీసీ నాకౌట్‌లకు సంబంధించి ఈ లెక్కల తేడా చూస్తే టీమిండియాకు ధోని ఎంత ముఖ్యమో ఊహించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ప్రతిభను చాటుకుంది. ఈ టోర్నీలో భారత్ ట్రోఫీ అందుకుంది. అనంతరం 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను కూడా ముద్దాడింది.అనంతరం.. భారత్ క్రికెట్  టెస్టు, వన్ డే, పొట్టి క్రికెట్ టీ20.. ఇలా మూడు  ఫార్మాట్లలోనూ భారత్ క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది.  ప్రపంచ నెంబర్ వన్‌ జట్టుగా నిలిచింది.

ధోనీ ఇతర కెప్టెన్ల కంటే డిఫరెంట్. ధోని అద్భుతమైన కెప్టెన్ మాత్రమే కాదు అదృష్టం కలిసొచ్చిందని అంటారు. అయితే వాస్తవానికి అదృష్టం ఒకటి లేదా రెండు అవకాశం ఇవ్వవచ్చు. అయితే అదృష్టంతో మళ్లీ మళ్లీ విజయాలను అందుకోలేరు. మూడు ప్రధాన ICC ట్రోఫీలను గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్ ధోనీగా నిలవడానికి కారణం ధోని అద్భుతమైన కెప్టెన్సీ మాత్రమే అని చెప్పవచ్చని అంటున్నారు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు.

పటిష్టమైన, నిర్మయాత్మకమైన కెప్టెన్సీ లేకుండా విజయం అందుకోలేదు. ఈ గుణం కెప్టెన్‌గా ధోనీకి ఉంది. అంతేకాదు ధోనీ మైదానంలో అక్కడికక్కడే  పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవాడు. ఈ గుణం మిగిలిన భారత కెప్టెన్లలో లేని నైపుణ్యాలు. రిటైర్ అయిన తర్వాత కూడా ఐసిసి టోర్నమెంట్లు ఎప్పుడు జరిగినా ధోని అందరికీ గుర్తుకు రావడానికి ఇదే కారణం అని చెప్పవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..