Indian Cricket: టీ20 సెమీస్‌లో భారత్ ఓడిపోవడంతో జట్టుపై వెల్లువెత్తుతోన్న విమర్శలు.. ఇప్పుడు ఆ మాజీ దిగ్గజ క్రికెటర్ కూడా..

టీ20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ విజయం సాధిస్తుందని.. అప్పటికే ఫైనల్‌కు చేరిన పాక్ జట్టుతో కప్ కోసం తలపడుతుందని అందరూ ఎంతో ఆశగా.. కానీ భారత జట్టు..

Indian Cricket: టీ20 సెమీస్‌లో భారత్ ఓడిపోవడంతో జట్టుపై వెల్లువెత్తుతోన్న విమర్శలు.. ఇప్పుడు ఆ మాజీ దిగ్గజ క్రికెటర్ కూడా..
Kapil Dev
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 11, 2022 | 5:12 PM

భారత క్రికెట్ అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ విజయం సాధించి.. అప్పటికే ఫైనల్‌కు చేరిన పాక్ జట్టుతో కప్ కోసం తలపడుతుందని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇందుకు విరుద్ధంగా భారత ప్లేయర్లు అందరి ఆశలను అడియాసలు చేస్తూ దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా భారత్‌లోని క్రికెట్ అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు నీరుకారిపోయారు. అంతేకాక భారత జట్టు ప్లేయర్లపై సాధారణ ప్రజలు మొదలు దిగ్గజ క్రికెటర్ల వరకు అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు.

కొందరైతే ‘చోకర్స్’ అని కూడా అంటున్నారు. అలా విమర్శిస్తున్న వారిలో భారత్‌కు ప్రపంచకప్‌ను అందించిన మాజీ దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ కూడా చేరారు. అయితే టీ20 ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ప్లేయర్లు విఫలమవడంపై  ఆయన చాలా వింతగా స్పందించారు. ‘‘వాళ్లను చోకర్స్ అందాం. ఆ మాట సరే. వాళ్లు చాలా చివరి వరకు వచ్చి, ఊపిరి పీల్చుకోలేకపోయారు. నేనూ ఒప్పుకుంటాను.. వాళ్లు చాలా చెత్తగా ఆడారు. కానీ ఈ జట్టులోని ప్లేయర్లే భారత క్రికెట్‌లో మెరుపులు మెరిపించి అనేక పురస్కారాలు అందించారు. అలాంటి జట్టు ఒక్క మ్యాచ్‌లో విఫలమయిందని మనం నిరుత్సాహపడకూదడు, వారినీ నిరుత్సాహపరచకూడదు’’ అని కపిల్ దేవ్ అన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలవడంపై మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో పరిస్థితులను ఇంగ్లండ్  మెరుగ్గా అంచనా వేసి ఇండియన్ టీమ్‌ను ఆలౌట్ చేయగలిగిందిన చెప్పారు.

కాగా ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో కేఎల్ రాహుల్ , రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ , మహ్మద్ షమీ, రిషబ్ పంత్ , భువనేశ్వర్ కుమార్ , రవిచంద్రన్ అశ్విన్ , అక్షర్ పటేల్ లాంటి మేటి ఆటగాళ్లు కూడా తమ సత్తాకు తగ్గట్టు ఆడేందుకు కష్టపడటంతో భారత్ మరోసారి ఐఐసీ టోర్నమెంట్ సెమీఫైనల్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..