ICC Awards: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు భారతీయులు.. లిస్టులో మాజీ సారథి, ఆసియా కప్ విజేతలు..
అక్టోబర్‌లో మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ఐసీసీ భారతదేశం నుంచి ఇద్దరు ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ముగ్గురు ఆటగాళ్లు ఆసియాకు చెందినవారే కావడం గమనార్హం.
ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ నుంచి ముగ్గురు సూపర్ స్టార్‌లు ఉన్నారు. ఇందులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, జింబాబ్వేకు చెందిన సికందర్ రజా ఉన్నారు. అలాగే భారత మహిళల టీం నుంచి జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ కేటగిరీకి నామినేట్ అయ్యారు. అక్టోబర్‌లో మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ఐసీసీ భారతదేశం నుంచి ఇద్దరు ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ముగ్గురు ఆటగాళ్లు ఆసియాకు చెందినవారే కావడం గమనార్హం. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పుడు భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్ ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు అక్టోబర్‌కు నామినేట్ అయ్యారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన మూడో ప్లేయర్ పాకిస్థాన్ ఆల్ రౌండర్ నిదా దార్.
ఆసియా కప్‌లో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన..
మహిళల ఆసియా కప్‌లో నిలకడైన ఆటతీరుతో దీప్తి ఈ అవార్డుకు అర్హురాలినని నిరూపించుకుంది. దీప్తి మొత్తం 8 మ్యాచ్‌లు ఆడి 7.69 సగటుతో 13 వికెట్లు పడగొట్టింది. థాయ్‌లాండ్, పాకిస్థాన్‌లపై దీప్తి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులకే 3 వికెట్లు తీసింది.
పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 27 పరుగులకే 3 వికెట్లు పడగొట్టింది. ఈ టోర్నీలో దీప్తి యూఏఈపై 49 బంతుల్లో 64 పరుగులు చేసి భారత్‌ను విజయానికి చేరువ చేసింది. 5 ఫోర్లు, 2 సిక్సర్లు కూడా బాదింది. మహిళల ఆసియా కప్‌లో దీప్తి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచింది.
గాయం నుంచి తిరిగొచ్చిన జెమీమా..
గాయం నుంచి కోలుకున్న భారత యువ బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల ఆసియా కప్‌లో పునరాగమనం చేసింది. ఈ టోర్నీలో జెమీమా 54.25 సగటుతో 217 పరుగులు చేసింది. శ్రీలంక, యూఏఈపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రెండు మ్యాచ్‌ల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. జెమీమా శ్రీలంకపై 53 బంతుల్లో 76 పరుగులు, యూఏఈపై 45 బంతుల్లో 75 పరుగులు చేసింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులలో కోహ్లి మొదటిసారిగా నామినేట్ అయ్యాడు. క్యాలెండర్ నెలలో 205 పరుగులు నమోదు చేస్తూ, తన అత్యుత్తమ ఫాం పొందాడు. అతను నెదర్లాండ్స్‌పై అజేయంగా 62 పరుగులు చేసి, తన సత్తా చాటాడు. ఆ తర్వాత ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు కీలక పాత్ర పోషించాడు. 53 బంతుల్లో 82 పరుగుల మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు.
కోహ్లి వలె, మిల్లర్ కూడా పురుషుల షార్ట్‌లిస్ట్‌లో మొట్టమొదటిసారిగా పేరు పొందాడు. అతను భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రాణించాడు. మూడు ODIలలో 117 పరుగులు, రెండు T20Iలలో 125 పరుగులు చేశాడు. ఇందులో 106 నాటౌట్‌తో అద్భుత నాక్ కూడా ఉంది. గౌహతిలో 79 బంతుల్లో మెరుపు సెంచరీ చేశాడు. ఈ తుఫాన్ ఫాంతోనే టీ20 ప్రపంచ కప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్టోర్నమెంట్‌కు ముందు ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో అతని తుఫాన్ ఫామ్‌ను కొనసాగించాడు. భారత్‌పై అతని జట్టు విజయం సాధించిన సమయంలో కీలక పాత్ర పోషించాడు.
జింబాబ్వేకు చెందిన సికందర్ రజా కూడా ఈ లిస్టులో చేరిపోయాడు. టీ20 ప్రపంచ కప్ ప్రారంభ దశల్లో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలచుకున్నాడు. దీంతోనే ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..