T20 World Cup: సఫారీలపై పాక్ విజయం.. కాని బాబర్ సేన సెమీస్ చేరాలంటే..
India vs Pakistan: పాకిస్తాన్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్ 2లో సెమీస్ చేరే జట్లపై ఉత్కంఠ మొదలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన 36వ మ్యాచ్‌లో పాకిస్థాన్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు సెమీఫైనల్ రేసులో కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ బ్యాట్ నుంచి అత్యధిక పరుగులు వచ్చాయి. అతను 22 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ సమయంలో షాదాబ్ 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. అదే సమయంలో ఇఫ్తికార్ అహ్మద్ 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా తరపున ఎన్రిక్ నోర్త్యా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
దానికి సమాధానంగా దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. అయితే, వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గడంతో డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం 14 ఓవర్లలో 142 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్రికా జట్టు ఛేదించాల్సి వచ్చింది. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోతూ సౌతాఫ్రికా టీం 9 వికెట్లకు 108 పరుగులు మాత్రమే చేసింది. కాగా, బాబర్ సేన సెమీస్ చేరాలంటే.. ఆదివారం జరిగే మిగతా జట్ల మ్యాచ్‌లపై ఆధారపడాల్సిందే.
ఇరు జట్ల ప్లేయింగ్ XI..
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలే రస్సో, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నోర్ట్జే, తబరిజ్ షమ్సీ.
పాకిస్థాన్ – మహ్మద్ రిజ్వాన్ (కీపర్), బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిం జూనియర్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, నసీమ్ షా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..