IPL 2023: ముగ్గురు ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ వేటు.. మినీ వేలంలో పాల్గొనే ఆ ప్లేయర్స్ ఎవరంటే?
Mumbai Indians: ఐపీఎల్ 2023కి ముందు, మినీ వేలం డిసెంబర్ 2022 లో జరగనుంది. ఇందులో ముంబై ఇండియన్స్ ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 కోసం అన్ని ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఐపీఎల్ 2023కి ముందు మినీ వేలం ఈ డిసెంబర్‌లో జరగనుంది. ఈ చిన్న వేలంలో, చాలా జట్లు కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసేలా కనిపిస్తోంది. అలాగే తమ జట్టులో కొంతమంది ఆటగాళ్లను కూడా చేర్చుకునేందు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ కూడా చేరింది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఐపీఎల్ 2023 మినీ వేలం కోసం ముంబై ఈ ముగ్గురు ఆటగాళ్లను కూడా విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
1. ఇషాన్ కిషన్..
2022లో జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్ల భారీ ధరకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2022 సీజన్‌లో కిషన్ 418 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 32.15గా నిలిచింది. అదే సమయంలో అతని స్ట్రైక్ రేట్ 120.11గా నిలిచింది. ఇది T20 ప్రకారం కొంచెం తక్కువగా నిలిచింది. మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
2. కీరన్ పొలార్డ్..
కీరన్ పొలార్డ్ తన వేగవంతమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. 2022లో పొలార్డ్‌ను రూ.6 కోట్లకు ముంబై తన వద్దే ఉంచుకుంది. గత సీజన్‌లో, పొలార్డ్ 11 మ్యాచ్‌లలో 144 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతను బౌలింగ్ చేస్తూ తన పేరు మీద 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ముంబై ఇండియన్స్ తరపున మాత్రమే ఆడిన కీరన్ పొలార్డ్ ఈ ఏడాది మినీ వేలానికి ముందు విడుదల కావచ్చని తెలుస్తోంది.
3. టైమల్ మిల్స్..
ఫాస్ట్ బౌలర్ టైమల్ మిల్స్‌ను ముంబై ఇండియన్స్ రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మిల్స్ 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. కానీ, అతని ఎకానమీ రేటు 11.18 చాలా ఎక్కువగా నిలిచింది. గత సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మిల్స్‌ను ముంబై ఇండియన్స్ మినీ వేలానికి ముందు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..