Watch Video: ఈ క్యాచ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మెరుపు ఫీల్డింగ్‌తో షాకిచ్చిన ప్లేయర్.. వైరల్ వీడియో

Western Australia vs New South Wales, Final: మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Watch Video: ఈ క్యాచ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మెరుపు ఫీల్డింగ్‌తో షాకిచ్చిన ప్లేయర్.. వైరల్ వీడియో
Marsh Cup Final
Follow us

|

Updated on: Mar 11, 2022 | 3:04 PM

క్యాచస్ విన్ మ్యాచస్ అనే సామెత క్రికెట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు చక్కిని ఉదాహారణగా నిలిచింది ఓ మ్యాచ్. మార్ష్ కప్ (Western Australia vs New South Wales, Final) ఫైనల్‌లో హిల్టన్ కార్ట్‌రైట్ క్యాచ్(Hilton Cartwright catch) ఫీల్డర్లతోపాటు, కామెంటేటర్లు, ప్రేక్షకుల, నెటిజన్లు కూడా ఈ క్యాచ్‌ను చూసి షాకవుతున్నారు. కార్ట్‌రైట్ న్యూ సౌత్ వేల్స్ కీలక బ్యాట్స్‌మెన్ మోసెస్ హెన్రిక్స్ క్యాచ్‌ను పట్టుకోవడం ఆశ్చర్యపరిచింది. కార్ట్‌రైట్ క్యాచ్ మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దీంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్ ఫైనల్‌(Marsh Cup Final)ను కేవలం 18 పరుగుల తేడాతో గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. దానికి సమాధానంగా న్యూ సౌత్ వేల్స్ జట్టు కేవలం 207 పరుగులకే కుప్పకూలింది. 8 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన ఆండ్రూ టై మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఝే రిచర్డ్‌సన్ బంతితో, బ్యాట్‌తో అద్భుతంగా రాణించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కార్ట్‌రైట్ గురించి మాట్లాడితే, ఈ ఆటగాడు బ్యాట్‌తో అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. కానీ, అతని ఫీల్డింగ్ బలంతో మ్యాచ్ పరిస్థితిని మార్చేశాడు. 45వ ఓవర్‌లో 43 పరుగులతో ఆడుతున్న మోసెస్ హెన్రిక్స్.. కార్ట్‌రైట్ అద్భుత క్యాచ్‌కు ఫైనల్ చేరాడు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. హెన్రిక్స్ ఒక సిక్సర్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే కార్ట్‌రైట్ లాంగ్ ఆన్‌లో నిలబడి ఉన్నాడు. అతను తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. హెన్రిక్స్ వికెట్ పడగానే న్యూ సౌత్ వేల్స్ జట్టు ఆనందంలో మునిగిపోయింది.

కార్ట్‌రైట్ అమేజింగ్ క్యాచ్.. 45వ ఓవర్లో న్యూ సౌత్ వేల్స్ జట్టు 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. హెన్రిక్స్ 74 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అతని జట్టు విజయం సాధించాలంటే 22 పరుగులు మాత్రమే కావాలి. అలాంటి సమయంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కెప్టెన్ అష్టన్ టర్నర్ చైనామన్ బౌలర్ డార్సీ షార్ట్‌ను బౌలింగ్‌లోకి దించాడు. హెన్రిక్స్ అతని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి సరిగ్గా బౌలర్ తలపై నుంచి వెళ్లి, లాంగ్ ఆన్‌లో నిల్చున్న కార్ట్‌రైట్ అద్భుతంగా పరిగెత్తుతూ క్యాచ్ పట్టుకున్నాడు.

అమాంతం గాల్లోకి లేచి, చాలా దూరం గాల్లోనే ముందుకు వెళ్లాడు. బాట్‌ని పట్టుకుని, బౌండరీలైన్ ఇవతల పడిపోయాడు. హెన్రిక్స్ ఔటైన తర్వాత ఆడమ్ జంపా, తన్వీర్ సంఘాలను త్వరగా ఔట్ చేసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను గెలుచుకుంది.

తక్కువ స్కోర్ చేసినా.. విజయం.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు మాత్రమే చేసింది. బ్యాట్స్‌మెన్ జోష్ ఫిలిప్పి 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. డార్సీ షార్ట్ 3 పరుగుల వద్ద ఔటయ్యాడు. షాన్ మార్ష్ 29, బాన్‌క్రాఫ్ట్ 39 పరుగులు చేసి కెప్టెన్ అశ్చన్ టర్నర్ తొలి బంతికే ఔటయ్యాడు. కార్ట్‌రైట్ కూడా 6 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆరోన్ హార్డీ మరియు కెల్లీ 27-27తో స్కోరు చేయగా, బెహ్రెన్‌డార్ఫ్ 24 పరుగులతో నాటౌట్‌గా రాణించి జట్టు స్కోరును 200 దాటేలా చేశారు. ఝే రిచర్డ్‌సన్ కూడా 44 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ను ఆడాడు. దానికి సమాధానంగా డేనియల్ సామ్స్ 42 పరుగులు చేయగా, హెన్రిక్స్ 43 పరుగుల తేడాతో జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా అది కుదరలేదు. టై 4, ఆరోన్ హార్డీ 3 వికెట్లు తీశారు. న్యూ సౌత్‌వేల్స్‌ తరఫున ఆడమ్‌ జంపా 3 వికెట్లు తీశాడు.

Also Read: Women’s World Cup 2022: విజయానికి 10 పరుగులు.. చేతిలో 2 వికెట్లు.. చివరి ఓవర్లో ఏమైందంటే?

IND vs SL: ఈ గ్రౌండ్‌లోనైనా సెంచరీ చేస్తాడా.. అభిమానుల కోరిక నెరవేరుస్తాడా..