AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ముందుకు సాగాలంటే గెలవాల్సిందే.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా..

Icc Women World Cup 2022: రెండు మ్యాచ్‌లు ఆడిన భారత మహిళల జట్టు ఒక విజయం, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

IND vs WI: ముందుకు సాగాలంటే గెలవాల్సిందే.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా..
Womens World Cup 2022 Ind Vs Wi
Venkata Chari
|

Updated on: Mar 11, 2022 | 3:38 PM

Share

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌(ICC Women’s World Cup) లో శనివారం వెస్టిండీస్‌(India vs West Indies) తో జరుగుతున్న మూడో లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తమ బ్యాట్స్‌మెన్ నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. పాకిస్థాన్‌పై అద్భుత ఆరంభం తర్వాత, పేలవమైన బ్యాటింగ్ కారణంగా న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ చేతిలో 62 పరుగుల తేడాతో పరాజయం పాలైన తర్వాత, ఐదో స్థానంలో ఉన్న మిథాలీ రాజ్(Mithali Raj) కెప్టెన్సీలోని భారత జట్టు బౌన్సీ పిచ్‌పై వరుస పరాజయాలు తమ జోరును దెబ్బతీస్తాయి. కాబట్టి వరుసగా రెండో ఓటమిని తప్పించుకోవాలనుకుంటోంది.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన, మిథాలీ రాజ్, యాస్తిక భాటియా, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు పేలవంగా ఆడారంటూ విమర్శలు కూడా వచ్చాయి. 261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ 62 బంతుల్లో 71 పరుగులు చేసింది. కౌర్ తప్ప ఎవరూ పరుగులు చేయలేకపోయారు. అస్థిరమైన ఫామ్ ఉన్నప్పటికీ, ప్లేయింగ్ XIకి షెఫాలీ వర్మ తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మునుపటి మ్యాచ్‌లో యాష్తిక కూడా ఆకట్టుకోకపోవడంతో షెఫాలీ వర్మకు మరలా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. భారత బ్యాట్స్‌మెన్ 162 డాట్ బాల్స్‌ ఆడడం అంటే దాదాపు 27 ఓవర్లు పరుగులు చేయలేదు. తొలి 20 ఓవర్లలో ఆ జట్టు 50 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సీనియర్ ఆటగాళ్ల వైఫల్యంతోనే మరిన్ని ఇబ్బందులు.. జట్టు ప్రదర్శనపై ప్రధాన కోచ్ రమేష్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం స్టెఫానీ టేలర్, డియాండ్రా డాటిన్, అనిస్సా మహ్మద్ వంటి ఆటగాళ్లు ముందున్నారు. మ్యాచ్‌కు ముందు పవార్ మాట్లాడుతూ, ‘నిజం చెప్పాలంటే, 20 ఓవర్లలో జట్టు బ్యాటింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన గత ఆరు మ్యాచ్‌లలో మా ప్రదర్శనను పరిశీలిస్తే, మేం మా వ్యూహాన్ని చాలా బాగా అమలు చేసాం’ అని తెలిపాడు. తన చివరి టోర్నీ ఆడుతున్న మిథాలీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతుండగా, మంధాన కూడా అలానే ఉంది. దీంతో పూజా వస్త్రాకర్‌, స్నేహ రానాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. సీనియర్ ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలని కోచ్ పవార్ స్పష్టంగా పేర్కొన్నాడు.

ప్రపంచకప్‌లో టీం ఇండియాపై ఒత్తిడి.. ‘ఇది ప్రపంచకప్‌లో ఒత్తిడి. కానీ నేను ఎటువంటి సాకు చెప్పదలచుకోలేదు. మంచి పనితీరు కనబరచాల్సిన సమయం ఇదేనని, ఇందుకోసం గత ఆరు నెలలుగా సన్నాహాలు చేస్తున్నాం. మేం ఇంగ్లండ్ వెళ్లి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు చేశాం. ప్రాక్టీస్ చేయడానికి పూర్తి అవకాశాలను కూడా పొందాం. ప్రస్తుతం జట్టు ఒక యూనిట్‌గా బాగా రాణించవలసి ఉంది. నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఓపెనర్ ఎస్ మేఘనను ఎంపిక చేయలేదు. ఆమెను జట్టు నుంచి తప్పించింది.

టోర్నమెంట్‌లో వెస్టిండీస్‌కు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్ టేలర్ జోరును కొనసాగించాలనుకుంటుంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టేలర్‌కి బౌలింగ్ చేయడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా, ఆమె ఎనిమిది మంది బౌలర్లను ప్రయత్నించింది. షామిలియా కానెల్, షకీరా సల్మాన్, చినెల్లె హెన్రీ, అనిస్సా వంటి బౌలర్లు వెస్టిండీస్ జట్టులో ఉన్నారు. కాబట్టి భారత్‌కు మూడో పోరు అంత సులభం కాదు.

మహిళల ప్రపంచ కప్ 2022లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్లు ఎప్పుడు తలపడతాయి?

మార్చి 12 (శనివారం)న భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి.

మహిళల ప్రపంచ కప్ 2022లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

మహిళల ప్రపంచకప్ 2022లో భారత్, వెస్టిండీస్ మధ్య హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో మ్యాచ్ జరగనుంది.

మహిళల ప్రపంచకప్ 2022లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

మహిళల ప్రపంచకప్ 2022లో భారత్, వెస్టిండీస్ మధ్య భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు టాస్‌ జరగనుంది.

ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషల్లో చూడవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో డిస్నీ+హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.

Also Read: Women’s World Cup 2022: విజయానికి 10 పరుగులు.. చేతిలో 2 వికెట్లు.. చివరి ఓవర్లో ఏమైందంటే?

ICC Women World Cup 2022: ప్రపంచకప్‌లో వెనుకబడుతున్న టీమ్‌ ఇండియా.. ఒకటి గెలుపు మరొకటి ఓటమి..