AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup 2022: విజయానికి 10 పరుగులు.. చేతిలో 2 వికెట్లు.. చివరి ఓవర్లో ఏమైందంటే?

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాక్ జట్టు ఘోర పరాజయం పాలైంది.

Women’s World Cup 2022: విజయానికి 10 పరుగులు.. చేతిలో 2 వికెట్లు.. చివరి ఓవర్లో ఏమైందంటే?
Women’s World Cup 2022
Venkata Chari
|

Updated on: Mar 11, 2022 | 2:33 PM

Share

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌(ICC Women’s World Cup)లో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా(Pakistan Women vs South Africa Women) జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా తన విజయ పరంపరను కొనసాగించింది. పాకిస్థాన్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీంకు ఇది వరుసగా మూడో ఓటమి. దక్షిణాఫ్రికా కంటే ముందు పాకిస్థాన్ జట్టు భారత్, ఆస్ట్రేలియాల చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్‌పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో వరుసగా మూడో ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు కష్టాలు ఎక్కువయ్యాయి.

దక్షిణాఫ్రికా టీం పాక్ ముందు 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనికి బదులుగా పాక్ జట్టు కేవలం 217 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో పాక్ జట్టు ఘోర పరాజయం పాలైంది.

చివరి ఓవర్ థ్రిల్.. చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, చేతిలో 2 వికెట్లు మిగిలి ఉన్నాయి. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ బాధ్యతలను షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ తీసుకుంది. తొలి బంతికే 2 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. కానీ, తర్వాతి బంతికే ఇస్మాయిల్ పాకిస్థాన్‌కు 9వ దెబ్బ తీశింది. డయానా పెవిలియన్‌కు చేరుకుంది. దీని తర్వాత, తర్వాతి బంతికి మళ్లీ సింగిల్ వచ్చింది. ఇక చివరి 3 బంతుల్లో పాకిస్థాన్‌కు 7 పరుగులు కావాలి. లక్ష్యం చేరుకునేట్లు కనిపించింది. కానీ, దక్షిణాఫ్రికా బౌలర్ తన సత్తా చాటి మరో వికెట్ పడగొట్టింది.

భారీ ఛేజింగ్‌ ముందు బలైన పాకిస్థాన్ జట్టు.. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ దక్షిణాఫ్రికాకు ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానం అందించింది. ఈ నిర్ణయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికన్ కెప్టెన్ 62 పరుగులు చేయగా, ఓపెనర్ వోల్వార్ట్ 75 పరుగులు చేసింది. దీని ఆధారంగా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు చేయగలిగింది.

5వ సారి 200 పరుగులకు పైగా ఛేజ్ చేసే అవకాశం పాకిస్థాన్‌కు దక్కింది. కానీ, లక్ష్యం చేరుకునేందుకు నానా కష్టాలు పడడంతో, చివరికి ఓటమిపాలైంది.

Also Read: IND vs SL: ఈ గ్రౌండ్‌లోనైనా సెంచరీ చేస్తాడా.. అభిమానుల కోరిక నెరవేరుస్తాడా..

Shane Warne: స్వదేశం చేరుకున్న షేన్‌ వార్న్‌ పార్థీవ దేహం.. లక్షమంది అభిమానుల సమక్షంలో ఆరోజునే అంత్యక్రియలు..