Varun Chakravarthy : రోహిత్ కెప్టెన్సీ పోగానే అతనికి షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ హీరో వన్డే జట్టు నుంచి ఔట్
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించిన సెలెక్టర్లు, జట్టు కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, అతని స్థానంలో యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది.

Varun Chakravarthy : ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించిన సెలెక్టర్లు, జట్టు కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, అతని స్థానంలో యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. రోహిత్ కెప్టెన్సీ మారగానే, అతని అత్యంత నమ్మకమైన ఆటగాడు, ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒక ఆటగాడిని కూడా వన్డే జట్టు నుంచి తొలగించారు. ఆ ఆటగాడే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.
ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. బంతితో అద్భుతాలు చేసి, 12 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ ట్రోఫీని అందించడానికి సహాయం చేశాడు. ఈ టోర్నమెంట్‌లో వరుణ్, భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. టోర్నీ మొత్తంలో మూడు మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన వరుణ్, కేవలం 15.11 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో తాను సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని వరుణ్ చక్రవర్తి పూర్తిగా రోహిత్ శర్మకే అంకితం చేశాడు. ముంబైలో జరిగిన సీఈఏటీ అవార్డుల వేడుకలో టీ20 ఇంటర్నేషనల్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా వరుణ్ మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తనకు స్థానం లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని, అయితే తనపై నమ్మకం ఉంచి, తనను తాను నిరూపించుకునే అవకాశం ఇచ్చిన రోహిత్ శర్మకు కృతజ్ఞతలు చెప్పాడు.
వరుణ్ చక్రవర్తి చివరిసారిగా ఈ ఏడాది మార్చి నెలలో ఛాంపియన్స్ ట్రోఫీలోనే న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో కేవలం 4 వన్డేలు ఆడి 10 వికెట్లు తీశాడు. ఇందులో 9 వికెట్లు ఛాంపియన్స్ ట్రోఫీలోనే వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన వన్డే జట్టు నుంచి వరుణ్‌ను తప్పించినప్పటికీ, టీ20 సిరీస్ కోసం మాత్రం అతన్ని ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో కూడా టీ20 ఫార్మాట్‌లో వరుణ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం కోసం జరిగే యుద్ధం కావడంతో, ఆ సిరీస్‌లో వరుణ్ పాత్ర చాలా కీలకం అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




