Yuzvendra Chahal : డివోర్స్ తర్వాత దుమారం.. మాజీ భార్య ఆరోపణలకు ధీటైన జవాబిచ్చిన యుజ్వేంద్ర చహల్
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడాడు. ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న ధనశ్రీ, తమ పెళ్లైన 2 నెలల్లోనే చహల్ తనను మోసం చేశాడని పరోక్షంగా ఆరోపించింది. అయితే, చహల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఈ ఏడాది మార్చిలో చహల్-ధనశ్రీకి అధికారికంగా విడాకులు మంజూరైన విషయం తెలిసిందే.

Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడాడు. ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న ధనశ్రీ, తమ పెళ్లైన 2 నెలల్లోనే చహల్ తనను మోసం చేశాడని పరోక్షంగా ఆరోపించింది. అయితే, చహల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఈ ఏడాది మార్చిలో చహల్-ధనశ్రీకి అధికారికంగా విడాకులు మంజూరైన విషయం తెలిసిందే. ఇటీవల మీడియాతో మాట్లాడిన యుజ్వేంద్ర చహల్ తనపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. “నేనొక అథ్లెట్‌ని, మోసం చేసేవాడిని కాదు. పెళ్లైన 2 నెలల్లోనే నేను మోసం చేసి ఉంటే, మా బంధం ఇంతకాలం కొనసాగేదా?” అని ప్రశ్నించాడు. “మా పెళ్లి దాదాపు నాలుగున్నర ఏళ్లు నడిచింది. 2 నెలల్లోనే మోసం జరిగితే అంతకాలంలో బంధంలో ఎలా కొనసాగారు ?” అని చహల్ ప్రశ్నించాడు. ఈ ఆరోపణలు తన దృష్టిలో పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పాడు.
తాను పాత విషయాలన్నీ మర్చిపోయి, ముందుకు సాగానని చహల్ చెప్పుకొచ్చాడు. “నేను ఇప్పటికే గతాన్ని మర్చిపోయాను, కానీ కొందరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. వాళ్ల ఇల్లు నా పేరుతోనే నడుస్తోంది. అందుకే వాళ్లు పదే పదే నా పేరును లాగుతున్నారు. నాకు దీని గురించి ఏమాత్రం చింత లేదు, పట్టించుకోను కూడా” అని ఘాటుగా బదులిచ్చాడు.
చహల్ పాత విషయాల గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. “సోషల్ మీడియాలో వంద విషయాలు నడుస్తుంటాయి, కానీ నిజం ఒక్కటే ఉంటుంది. ఆ నిజం ఏమిటంటే, నా దృష్టిలో ఆ చాప్టర్ ముగిసింది” అని చహల్ స్పష్టం చేశాడు. తాను ఈ విషయం గురించి మరోసారి ఎప్పుడూ మాట్లాడదలుచుకోలేదని తేల్చి చెప్పాడు.
యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫిబ్రవరి 2024లో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 2025లో కోర్టు వీరి విడాకుల దరఖాస్తును ఆమోదించింది. నివేదికల ప్రకారం, ధనశ్రీ వర్మకు చహల్ నుంచి 4.75 కోట్ల రూపాయల భరణం లభించినట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




