AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒక్క సిక్స్ తో అందరి అటెన్షన్ తిప్పుకున్న వైభవ్! శభాష్ బేటా అని మెచ్చుకున్న సుంధర్ పిచాయ్ టూ కెటిల్ బర్గ్

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే సిక్స్ కొట్టి సంచలనం రేపాడు. అతను ఐపీఎల్ చరిత్రలో మొదటి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. యువ ఆటగాడు ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భవిష్యత్‌లో భారత క్రికెట్‌కు అతను ఒక గొప్ప నక్షత్రంగా ఎదగబోతున్నాడు.

Video: ఒక్క సిక్స్ తో అందరి అటెన్షన్ తిప్పుకున్న వైభవ్! శభాష్ బేటా అని మెచ్చుకున్న సుంధర్ పిచాయ్ టూ కెటిల్ బర్గ్
Vaibhav Suryavanshi
Narsimha
|

Updated on: Apr 20, 2025 | 3:31 PM

Share

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుండగా, 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రంలోనే సంచలనం సృష్టించాడు. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రాజస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయంతో తప్పుకోవడంతో, జట్టు యాజమాన్యం అత్యంత కీలక నిర్ణయం తీసుకుని, బాలుడైన వైభవ్‌ను తుది జట్టులో చేర్చింది. ఇది ఆయనకు కలిసొచ్చింది. ఎందుకంటే మొదటి బంతికే సిక్స్ కొట్టి తన IPL జర్నీని ఓ అద్భుతమైన విధంగా ప్రారంభించాడు.

యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన వైభవ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వచ్చిన తొలి బంతినే స్టెపౌట్ అయి బౌండరీ దాటి సిక్స్ కొట్టాడు. ఈ ఘనతతో ఐపీఎల్ చరిత్రలో తొలి బంతికి సిక్స్ కొట్టిన పదో ఆటగాడిగా నిలిచాడు. ఆయన ముందు ఈ అరుదైన జాబితాలో చోటు దక్కినందుకు చాలా మారు ప్రతిభావంతులైనవారే. ఆండ్రీ రస్సెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, మహీష్ తీక్షణ వంటి స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే రాబ్ క్వినీ (2009), కెవాన్ కూపర్ (2012) వంటివారు ఉన్నారు. ఇప్పుడు అదే జట్టులో మరోసారి వైభవ్ కూడా ఈ ఘనతను సాధించడం విశేషం.

ఇంతటి బాలుడైన వయస్సులో, అంత పెద్ద వేదికపై, అంత ఆత్మవిశ్వాసంతో మొదటి బంతికే సిక్స్ కొట్టడం ఏ చిన్న విషయం కాదు. దీనివల్ల అతనిపై క్రికెట్ ప్రపంచం దృష్టి సారించింది. ప్రస్తుత మ్యాచ్‌లో వైభవ్ బౌండరీల వర్షం కురిపిస్తూ ఆటను సాగించడంతో ప్రత్యర్థి బౌలర్లు అతన్ని ఆపలేకపోతున్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఈ బాలుడి రూపంలో ఒక నూతన నక్షత్రం కనిపించబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ అరంగేట్రం కేవలం ఒక షాట్ వల్లే కాదు, అతని ఆటపై ఉన్న విశ్వాసం, దూకుడు, గేమ్ సెన్స్ వల్ల మరింత ప్రత్యేకతను పొందింది. ఐపీఎల్‌లో ప్రతి సంవత్సరం కొత్త టాలెంట్‌లు వస్తూనే ఉన్నా, వైభవ్ సూర్యవంశీ ఆటగాడు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాడు. అయితే రిచర్డ్ కెటిల్ బర్గ్, గూగుల్ సీయివో సుందర్ పిచాయ్, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ గోయోంక, లలిత్ మోడీలు ప్రశంసల వర్షం కురిపించారు.

సాయంత్రం జరిగిన రెండవ మ్యాచ్‌లో జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌ను కేవలం 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రమ్, యశస్వి జైస్వాల్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌లు ప్రేక్షకులను అలరించగా, అవేష్ ఖాన్ కీలక సమయంలో అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్