Cricket: ఏమైందిరా.! ఈ ప్రాంతంలో క్రికెట్‌పై బ్యాన్.. బ్యాట్ పట్టుకుని కనిపిస్తే మోత మోగినట్టే

గ‌తంలో కొన్ని దేశాలే ఆడే ఆట క్రికెట్‌. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా వ్యాపించింది. చిన్న‌పిల్ల‌ల నుంచి న‌డివ‌య‌సు వాళ్ల వ‌ర‌కూ సమయం దొరికితే చాలు బ్యాట్, బాల్ అందుకుంటారు. గ‌ల్లీల్లో, ఇరుకు వీధుల్లో బుల్లి క్రికెట‌ర్లు ఎంద‌రో మ‌న‌కు క‌నిపిస్తుంటారు.

Cricket: ఏమైందిరా.! ఈ ప్రాంతంలో క్రికెట్‌పై బ్యాన్.. బ్యాట్ పట్టుకుని కనిపిస్తే మోత మోగినట్టే
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 08, 2024 | 4:27 PM

గ‌తంలో కొన్ని దేశాలే ఆడే ఆట క్రికెట్‌. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా వ్యాపించింది. చిన్న‌పిల్ల‌ల నుంచి న‌డివ‌య‌సు వాళ్ల వ‌ర‌కూ సమయం దొరికితే చాలు బ్యాట్, బాల్ అందుకుంటారు. గ‌ల్లీల్లో, ఇరుకు వీధుల్లో బుల్లి క్రికెట‌ర్లు ఎంద‌రో మ‌న‌కు క‌నిపిస్తుంటారు. ఈ టీ20ల యుగంలో క్రికెట్ మ‌రింత పాపుల‌ర్ అవుతున్న వేళ.. యూర‌ప్ దేశాల్లోని ఓ న‌గ‌రం మాత్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ప్రాంతంలో క్రికెట్‌పై నిషేధం విధించింది. ఒక‌వేళ ఎవ‌రైనా ఈ క‌ట్టుబాటును ఉల్లంఘిస్తే భారీగా జ‌రిమానా విధించేందుకు సిద్ధ‌మైంది.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇట‌లీలోని మొన్‌ఫాల్కొనే అనే న‌గ‌రం ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు. అడ్రియాటిక్ స‌ముద్ర‌పు ఒడ్డున గ‌ల ఈ సిటీ చాలా చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అంతా క‌లిపితే 30 వేల‌కు మించ‌ని జ‌నాభా. క్రికెట్ పిచ్ త‌యారీకి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు కావాలి. పైగా మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌కు ఓ చిన్న‌పాటి స్టేడియం అయినా అవ‌స‌రం. కానీ, పిచ్ త‌యారీకి ఆ న‌గ‌రం మున్సిప‌ల్ ఖ‌జానాలో డ‌బ్బులు లేవు. స్టేడియం నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భారీ స్థలంగానీ మొన్‌ఫాల్కొనేలో లేదు. పైగా క్రికెట్ ఆడే స‌మ‌యంలో బంతి త‌గిలితే పెద్ద ప్ర‌మాద‌మే. అందుక‌నే మేయ‌ర్ అన్నా మ‌రియా సిసింట్ క్రికెట్‌ను ప్రోత్స‌హించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో నిషేధం విధించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

న‌గ‌ర‌వాసులు ఎవ‌రూ క్రికెట్ ఆడొద్ద‌ని ఆమె హుకూం జారీ చేశారు. తమ మాట‌ను పెడ చెవిన పెడుతూ ఎవ‌రైనా క్రికెట్ ఆడిన‌ట్టు తెలిస్తే.. భారీ జ‌ర‌మానా త‌ప్ప‌ద‌ని మేయ‌ర్ అన్నా మ‌రియా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. అయినా స‌రే ఎవ‌రైనా క్రికెట్ బ్యాటు, బంతితో కంట‌ప‌డితే.. 100 యూరోలు అంటే భార‌తీయ క‌రెన్సీలో 9 వేల రూపాయలు ఫైన్ వేస్తామ‌ని ఆమె వార్నింగ్‌ ఇచ్చారు. అయితే మేయ‌ర్ నిర్ణ‌యంపై మొన్‌ఫాల్కొనే ప్ర‌జ‌లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు పెద్ద‌వాళ్లు ఆమె వైఖ‌రిని అభినందిస్తున్నారు. కానీ.. యూత్‌ మాత్రం రాంగ్‌ డెసిషన్‌ అంటున్నారు. న‌గ‌రంలో జాగ లేద‌ని చెప్పి క్రికెట్‌పై నిషేధం విధించ‌డం ఏంటీ? అని మేయ‌ర్‌ను విమర్శిస్తున్నారు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..