Ravi Kiran |
Updated on: Sep 08, 2024 | 3:14 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2025) సీజన్ 18 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ జట్టు కీ ప్లేయర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను వేలానికి ముందుగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
దీంతో ఆర్సీబీలో ఇక 'కే..జీ..ఎఫ్' శకం ముగిసినట్టే అని బెంగళూరు ఫ్యాన్స్ అంటున్నారు. ఐపీఎల్ 2023లో ఈ కేజీఎఫ్ జోడి చాలాసార్లు జట్టును ఆదుకున్న విషయం విదితమే. ఇక రానున్న రోజుల్లో ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరన్నది తేలాల్సి ఉంది.
2022 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ ఫాఫ్ డుప్లెసిస్‌ను దక్కించుకుంది. ఇక అనంతరం అతడ్ని జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. ఆర్‌సీబీ తరఫున 45 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్ 15 అర్ధసెంచరీలతో మొత్తం 1636 పరుగులు చేశాడు.
మరోవైపు డుప్లెసిస్‌ని ఆర్సీబీ వదులుకోవడానికి ప్రధాన కారణంగా అతడి ఏజ్ అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 40 ఏళ్లు దాటడంతోనే.. అతడి ఫామ్, గాయాల బెడద లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ఫాఫ్‌ను తప్పిస్తున్నారని టాక్.
ఇక గ్లెన్ మాక్స్‌వెల్‌ను వదులుకోవాలనే నిర్ణయం వెనుక ప్రధాన కారణం గత సీజన్‌లోని అతడి ప్రదర్శన. ఐపీఎల్ 2024లో 10 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసిన మ్యాక్సీ 5.78 సగటుతో 52 పరుగులు మాత్రమే చేశాడు.
ముఖ్యంగా, అతడు ఒకే సీజన్‌లో 5 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. అందుకే మ్యాక్స్‌వెల్‌ను విడుదల చేయాలని ఆర్సీబీ నిర్ణయించిందట. దీంతో కేజీఎఫ్‌లో జీ(గ్లెన్ మ్యాక్స్‌వెల్), ఎఫ్(ఫాఫ్ డుప్లెసిస్) ఇక కనిపించరు.