IPL 2021: బీసీసీఐ, ఐపీఎల్‌కు మంత్రి కేటీఆర్‌ ఆఫర్‌.. మ్యాచ్‌ నిర్వహణకు మద్ధతిస్తామంటూ వ్యాఖ్య..

IPL 2021 venues list: ఈఏడాది నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్‌ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ బీసీసీఐతో పాటు ఐపీఎల్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు.

  • Narender Vaitla
  • Publish Date - 1:00 pm, Sun, 28 February 21
IPL 2021: బీసీసీఐ, ఐపీఎల్‌కు మంత్రి కేటీఆర్‌ ఆఫర్‌.. మ్యాచ్‌ నిర్వహణకు మద్ధతిస్తామంటూ వ్యాఖ్య..

IPL 2021 venues list : ఈఏడాది నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్‌ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ బీసీసీఐతో పాటు ఐపీఎల్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు.
రాబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్‌.. మ్యాచ్‌ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నాయని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్‌ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఐపీఎల్‌ నిర్వహించాలని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి ఐపీఎల్‌ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.

Also Read: IPL 2021: ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయా.. లేదా.. కరోనా నేపథ్యంలో ఏం జరగనుంది.?

SRH Auction Girl: కుర్రకారు హృదయాలను దోచేసిన మిస్టరీ లేడీ.. సన్‌రైజర్స్‌తో ఉన్న ఆమె ఎవరంటే.!