బెంగాల్ ఎన్నికల్లో క్రికెట్ దాదా ఎవరికి జైకొట్టేను.. సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ..!

త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అయా రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైనే అందరి ద‌ృష్టి పడింది.

బెంగాల్ ఎన్నికల్లో క్రికెట్ దాదా ఎవరికి జైకొట్టేను.. సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా ఉత్కంఠ..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 28, 2021 | 12:27 PM

Sourav Ganguly Political Entry : త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అయా రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైనే అందరి ద‌ృష్టి పడింది. బెంగాల్‌ అసెంబ్లీలో తిరుగులేని పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ఇదే క్రమంలో రెండు పార్టీలూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక, ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన స్టైల్‌లో బెంగాలీలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆకర్షణియమైన పథకాలతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు భారతీయ జనతాపార్టీ అధికారమే పరమావధిగా పావులు కదుపుతోంది. ప్రధాని మోదీతోసహా అధినాయకత్వం మొత్తం బెంగాల్‌పై ఫోకస్ చేశారు. అటు ప్రజాదరణ కలిగిన నేతలను పార్టీలో చేర్చుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఊపు పెంచుతున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల్లో ప్రముఖ సినీ గ్లామర్‌తో పాటు క్రికెటర్లు, సెలబ్రిటీలను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు ఉండటంపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా ఉందని విమర్శలు చేశారు. ఇలా మమతా బెనర్జీకి కోపం తెప్పించిన బీజేపీ… గంగూలీని తమవైపు లాగేసుకోవడం ద్వారా మరింత పైచేయి సాధించాలని చూస్తోంది. ఒకప్పుడు బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థిగా గంగూలీ పేరు కూడా తెరపైకి వచ్చింది.

రబెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్… బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అధ్యక్షుడు అయ్యాడో… అప్పటి నుంచే ఈయన బీజేపీలోకి వెళ్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇక, తాజాగా ఎన్నికల హడావుడి మొదలు కావడంతో.. తనను బీసీసీఐ అధ్యక్షుణ్ని చేసినందుకు రుణం తీర్చుకునేలా గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి.

గంగూలీ జాయినింగ్‌పై భారీయ జనతా పార్టీ నేతలు గుసగుసలు కూడా ఎక్కువయ్యాయి. గంగూలీ తమ పార్టీలో చేరితే… ఆయనకు ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామనీ… బెంగాల్‌కి పరిమితం చేయబోమని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే, మార్చి 2న అమిత్ షా కోల్‌కతాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో… ఆయన బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో కలిసి జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

అయితే, గతంలోనే గంగూలీ బీజేపీలోకి వస్తారన్న వార్తలు వెలువడ్డాయి. అంతలోనే సౌరవ్ అనారోగ్యానికి గురయ్యారు. రెండు సార్లు ఆంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. దాదాకు ప్రస్తుతం ఉన్న స్టెంట్లకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేశారు వైద్యులు. కాగా ఇటీవల గంగూలీకి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన మళ్లీ చురుకుగా కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అహ్మదాబాద్‌లో ప్రారంభించిన మోతేరా స్టేడియం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఆయన మరోసారి బీజేపీలో చేరుతారన్న వార్తలు గుప్పుమన్నాయి.

మరోవైపు, రాజకీయాల జోలికి గంగూలి రాకపోవచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఇటీవల అభిప్రాయ పడింది. గంగూలీ బెంగాల్‌కి గర్వకారణమనే విషయం అందరికీ తెలిసిందేనని, కొందరు ఎన్నికలను ‘దీదీ వెర్సస్ దాదా’గా ప్రాజెక్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గంగూలీ చాలా తెలివైన వాడని, బీజేపీ ఉచ్చులో పడరని టీఎంసీ నేతలు అంటున్నారు. కాగా, ఇంతకీ గంగూలీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదీ బెంగాల్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఆయన రాజకీయ ప్రవేశంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సీన్ మారిపోతుందంటున్నారు.

ఇదీ చదవండిః ఉధృతమవుతున్న విశాఖ ఉద్యమం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. మార్చి 5 న బంద్‌కు పిలుపు