Mangalsutra Offers As Traffic Fine : హెల్మెట్ లేదని మహిళకు రూ.500 ఫైన్.. ట్రాఫిక్ పోలీసులకు మంగళసూత్రం ఇచ్చేసిన యువతి

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వెయ్యడం సర్వసాధారణం.. అయితే ఇలా ఫైన్స్ వేసే సమయంలో ఒకొక్కసారి విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి..

  • Surya Kala
  • Publish Date - 12:18 pm, Sun, 28 February 21
Mangalsutra Offers As Traffic Fine : హెల్మెట్ లేదని మహిళకు రూ.500 ఫైన్.. ట్రాఫిక్ పోలీసులకు మంగళసూత్రం ఇచ్చేసిన యువతి

Mangalsutra Offers As Traffic Fine : ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వెయ్యడం సర్వసాధారణం.. అయితే ఇలా ఫైన్స్ వేసే సమయంలో ఒక్కక్కసారి విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఒకొక్కసారి ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్ తమ వాహన ధరకంటే ఎక్కువుగా ఉందని వాహనదారులు ఆ బైక్స్ ను వదిలివెళ్లిన సంఘటనలు కూడా వింటూనే ఉన్నాం.. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దంపతులు తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా పోలీసులు వినకపోవడంతో.. లేకండా ఆ మహిళ తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి జరిమానాగా ఇచ్చి సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో కర్ణాటకలో 30 ఏళ్ల మహిళ ట్రాఫిక్ పోలీసులకు తన మంగళసూత్రాన్ని ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

హుక్కేరిలోని హల్లోలిహట్టి గ్రామంలో హోటల్ నడుపుతున్న భారతి విభూతి (30), ఆమె భర్త ఆదివారం తమ మోటర్‌బైక్‌ పై సిటీ మార్కెట్ లో షాపింగ్ కు వెళ్లారు.. అప్పుడు మంచం కొనుగోలు చేసేందుకు రూ.1800 తమ వెంట తీసుకెళ్లారు. మార్కెట్‌లో రూ. 1700 విలువైన మంచాన్ని వారు కొనుగోలు చేశారు. అయితే వస్తూ ఈ దంపతులు తమ దగ్గర ఉన్న రూ. 100 లతో టిఫిన్ తిన్నారు. అయితే ఇద్దరు బైక్ మీద వస్తున్న సమయంలో బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదని చెప్పి ఆపారు.

హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నందుకు పోలీసులు రూ .500 జరిమానా చెల్లించామని భారతి దంపతులను కోరారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని.. చెప్పినా వినకుండా పోలీసులు వాదించడం మొదలు పెట్టారు.. జరిమానా చెల్లించామని పట్టుబట్టారని భారతి చెప్పారు. దాదాపు రెండు గంటలు వాదన కొనసాగింది, ప్రజలు గుమిగూడటం ప్రారంభించారు. ఎంత చెప్పినా ట్రాఫిక్ పోలీసులు వినకపోవడంతో తాను మంగళసూత్రన్ని తీసి ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చానని .. జరిమానా వాసులు చేయడానికి అమ్మమని చెప్పానని తెలిపింది. ఇంతలో అటుగా వచ్చిన సీనియర్ పోలీసు అధికారులు జోక్యం చేసుకుని దంపతులను వెళ్లనిచ్చారు.

ఈ సంఘటన జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:

Karthika Deepam Vantalakka : హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని వంటలక్క ఆస్తులు.. విలువ ఎంతో తెలుసా..!

సమంత వదిలిన సారంగదారియా సాంగ్.. ఆకట్టుకుంటున్న లవ్ స్టోరీ సినిమా పాట