Team India: ప్రాక్టీస్ చేయమని మొండికేసిన సీనియర్ ఆటగాళ్లు.. కివీస్‌పై ఓటమితో బయటికొచ్చిన షాకింగ్ విషయాలు

India vs New Zealand: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీని ఆడటం ద్వారా ప్రాక్టీస్ చేయాలని సెలక్టర్లు కోరుకున్నారు. కానీ వారందరూ అందులో ఆడటానికి నిరాకరించారు. దీంతో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్‌లో ఘోర వైఫల్యం చెందారు.

Team India: ప్రాక్టీస్ చేయమని మొండికేసిన సీనియర్ ఆటగాళ్లు.. కివీస్‌పై ఓటమితో బయటికొచ్చిన షాకింగ్ విషయాలు
Rohit Sharma, Virat Kohli
Follow us

|

Updated on: Nov 04, 2024 | 7:24 PM

India vs New Zealand: న్యూజిలాండ్‌పై భారత్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి తర్వాత అభిమానులను షాక్‌కు గురిచేసే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌కు ముందు, సెలక్షన్ కమిటీ టీమ్ ఇండియాలోని అగ్రశ్రేణి ఆటగాళ్లను ప్రాక్టీస్ కోసం దులీప్ ట్రోఫీలో పాల్గొనాలని కోరింది. కానీ, సీనియర్ ఆటగాళ్లు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరిగే టెస్ట్ సిరీస్‌ల కోసం ప్రాక్టీస్ చేసేందుకు ఒప్పుకోలేదంట. ఈ టోర్నీ అంత ముఖ్యమైనది కాదని భావించిన సీనియర్ ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ నిరాకరించారని తెలుస్తోంది.

విరాట్ – రోహిత్ దులీప్ ట్రోఫీ ఆడాలని అనుకోలేదు..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, దులీప్ ట్రోఫీ సహాయంతో, ప్రతి సీనియర్ ఆటగాడు రాబోయే మ్యాచ్‌లకు తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకోవాలని సెలక్టర్లు కోరుకున్నారు. అయితే, ఈ సమయంలో ఎవరూ ఆడేందుకు అంగీకరించలేదు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన 0-3తో వైట్‌వాష్ తర్వాత, భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడి ఉంటే బాగుండేది అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వీరంతా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నందున ఈ ఆటగాళ్లు ఎక్కడో ఒకచోట ప్రాక్టీస్ చేసి ఉండాల్సిందని ఓటమి అనంతరం సునీల్ గవాస్కర్ అన్నాడు. బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత అది సులువవుతుందని భావించారు. కానీ, భారత్‌లో టీమిండియా కంటే న్యూజిలాండ్ మెరుగ్గా ఆడింది. పిచ్‌పై ఎక్కువ పరిజ్ఞానం కివీస్ ఆటగాళ్లకే ఉందని తేలింది.

జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ఆటగాళ్లందరూ చాలా గ్యాప్‌లో ఉన్నారు. బెంగళూరు, అనంతపురంలో జరిగిన దులీప్ ట్రోఫీలో అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ పాల్గొనాలని సెలక్షన్ కమిటీ కోరినట్లు సమాచారం. కానీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు నిరాకరించారు. కాగా, కొందరు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్, విరాట్, బుమ్రా దులీప్ ట్రోఫీలో ఆడేందుకు నిరాకరించడంతో.. దేశీయంగా ఆడేందుకు సిద్ధమైన రవీంద్ర జడేజాను విడుదల చేయాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

ఎవరు పాల్గొన్నారంటే?

శుభమాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ టెస్ట్ సీజన్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడిన ఆటగాళ్లలో చాలా మంది ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో కనీసం ఒక ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడారు.

న్యూజిలాండ్‌పై ఓటమి తర్వాత సీనియర్ ఆటగాళ్లు ప్రతిదీ మర్చిపోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ గవాస్కర్ తెలిపాడు. ఇది ఓ పీడకలలా ఉందని, ఇప్పుడు పూర్తిగా ఆస్ట్రేలియాపై దృష్టి పెట్టాలని ఆయన సూచించాడు. అలాగే, అక్కడికి వెళ్లి కఠోర సాధన చేసి మూడోసారి సిరీస్ గెలవాలంటూ పిలుపునిచ్చారు. 1-0 లేదా 2-0 లేదా 2-1తో గెలిచినా అభిమానులకు సంతోషమే అంటూ టార్గెట్ ఫిక్స్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..