AUS vs PAK: ఇంగ్లండ్‌పై సూపర్ హిట్.. ఆస్ట్రేలియాపై అట్టర్ ఫ్లాప్.. ఐరెన్ లెగ్ ఎంట్రీతో సీన్ రివర్స్ అంటోన్న ఫ్యాన్స్

AUS vs PAK: మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో పాకిస్థాన్ 203 పరుగులకే ఆలౌటైంది. పాక్ పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా కూడా కష్టాల్లో పడింది. కానీ, చివరికి కమిన్స్, స్టార్క్ భాగస్వామ్యం జట్టుకు విజయాన్ని అందించింది. రిజ్వాన్ నాయకత్వం ఓటమితో ప్రారంభమైంది.

AUS vs PAK: ఇంగ్లండ్‌పై సూపర్ హిట్.. ఆస్ట్రేలియాపై అట్టర్ ఫ్లాప్.. ఐరెన్ లెగ్ ఎంట్రీతో సీన్ రివర్స్ అంటోన్న ఫ్యాన్స్
Aus Vs Pak 1st Odi
Follow us

|

Updated on: Nov 04, 2024 | 6:57 PM

Australia vs Pakistan: మహ్మద్ రిజ్వాన్ నాయకత్వంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఓటమితో ప్రారంభమైంది. వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. నవంబర్ 4, సోమవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 203 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని ఛేదించిన కంగారూ జట్టు కూడా ఒక దశలో 185 పరుగులు చేసే సమయంలో 8 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్క్, కమిన్స్ జోడీ జట్టును విజయతీరాలకు చేర్చారు.

స్టార్క్ దాడితో పాకిస్థాన్ బెంబేలు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోని ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్‌పై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లపై పూర్తిగా లొంగిపోయింది. టెస్టు అనంతరం వన్డేల్లోకి అడుగుపెట్టిన అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న అయూబ్‌ను తొలి ఓవర్‌లోనే మిచెల్ స్టార్క్ బౌల్డ్ చేశాడు. అయితే స్టార్క్ తన తర్వాతి ఓవర్‌లో షఫీక్‌ను అవుట్ చేశాడు. టెస్టు జట్టు నుంచి తప్పుకోవడంతో వన్డే సిరీస్‌కు తిరిగి వచ్చిన బాబర్ అజామ్, వచ్చిన వెంటనే కొన్ని మంచి షాట్లు ఆడాడు. కానీ, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా చేతిలో బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పాక్ కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చాలా సేపు క్రీజులో నిలబడి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో పాకిస్థాన్ 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కానీ, జట్టుకు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చిన బౌలర్ నసీమ్ షా 40 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టును 203 పరుగులకు చేర్చాడు. ఆస్ట్రేలియా తరపున స్టార్క్ 3 వికెట్లు, కెప్టెన్ పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియాకు షాకిచ్చిన పాక్ పేసర్లు..

203 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియాకు కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ నాలుగో ఓవర్‌లో పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ పాక్ ఫాస్ట్ బౌలర్లపై విరుచుకుపడి వేగంగా పరుగులు సాధించారు. వీరిద్దరి మధ్య 85 పరుగుల భాగస్వామ్యం నెలకొని ఆస్ట్రేలియా విజయానికి పునాది వేసింది.

వీరిద్దరూ ఆడే వరకు ఆస్ట్రేలియా విజయానికి దగ్గరగా కనిపించింది. కానీ, హఠాత్తుగా హరీస్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది స్మిత్-ఇంగ్లిస్‌తో సహా ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను త్వరగా నిలిపివేశారు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 155 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి కెప్టెన్ పాట్ కమిన్స్ బాధ్యతలు స్వీకరించి మిచెల్ స్టార్క్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కమిన్స్ 33 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడిస్తామని ప్రకటించిన మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీ కొత్త ఇన్నింగ్స్ ఓటమితో ప్రారంభమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..