4 ఓవర్లు..16 డాట్స్.. 4 వికెట్లు.. కట్ చేస్తే ఐసీసీ అవార్డుతో హిస్టరీ క్రియేట్ చేసిన టీమిండియా స్వింగ్ సెన్సేషన్
2022 సంవత్సరం రేణుకకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి కేవలం15 నెలలే గడిచాయి. ఇంత తక్కువ సమయంలోనే తన సంచలన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిందీ యంగ్ క్రికెటర్.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ ఏడాది ఎమర్జింగ్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా టీమిండియా స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్‌ను ఎంపిక చేసింది. 2022 సంవత్సరం రేణుకకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి కేవలం15 నెలలే గడిచాయి. ఇంత తక్కువ సమయంలోనే తన సంచలన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిందీ యంగ్ క్రికెటర్. తన స్వింగ్ బంతులతో మేటి బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఈ ప్రదర్శనకు గుర్తింపుగానే రేణుక ఐసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రేణుక ఝులన్ గోస్వామి వారసురాలిగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు టీమిండియా తరఫున 7 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 41 వికెట్లు (వన్డేల్లో 18, టీ20ల్లో 23) పడగొట్టింది. ముఖ్యంగా గతేడాది కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాపై సంచలన బౌలింగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది రేణుక. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చిన స్వింగ్ సెన్సేషన్ 4 కీలక వికెట్లు తీసి కంగారూల వెన్ను విరిచింది. ఈ స్పెల్‌లో ఏకంగా 16 డాట్ బాల్స్ ఉండటం విశేషం.
కాగా ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ ప్లేయర్ అలైస్ క్యాప్సీ, సహచర క్రికెటర్ యష్తిక భాటియా పోటీపడినప్పటికీ.. రేణుకానే ఈ అవార్డు వరించింది. ఇక పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సన్‌కు ఈ అవార్డు లభించింది.భారత్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్, న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్‌లను వెనక్కు నెట్టి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం గెల్చుకున్నాడు.




Another four-wicket haul for Renuka Singh Thakur at #B2022 ?
Relive her sensational 4/10 against Barbados ?️ pic.twitter.com/mvXJzanvqm
— ICC (@ICC) August 4, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
