వన్డే ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపిన టీమిండియా నయా సెన్సేషన్‌.. ఏకంగా కోహ్లీ, రోహిత్‌లను వెనక్కు నెట్టిన గిల్

Basha Shek

Basha Shek |

Updated on: Jan 26, 2023 | 9:11 AM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న గిల్‌ తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 20 స్థానాలు ఎగబాకి ఆరో ప్లేసుకు చేరుకున్నాడు. ఇదే సిరీస్‌లో పెద్దగా పరుగులు చేయని విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉండగా, కెప్టెన్‌ రోహిత్ శర్మ 9వ ప్లేస్‌లో నిలిచారు.

వన్డే ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపిన టీమిండియా నయా సెన్సేషన్‌.. ఏకంగా కోహ్లీ, రోహిత్‌లను వెనక్కు నెట్టిన గిల్
Virat Kohli, Rohit, Gill

వన్డే ఫార్మాట్‌లో వరుస సెంచరీలతో దూసుకెళుతోన్న టీమిండియా నయా సెన్సేషన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న గిల్‌ తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 20 స్థానాలు ఎగబాకి ఆరో ప్లేసుకు చేరుకున్నాడు. ఇదే సిరీస్‌లో పెద్దగా పరుగులు చేయని విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉండగా, కెప్టెన్‌ రోహిత్ శర్మ 9వ ప్లేస్‌లో నిలిచారు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 360 పరుగులు (209, 40 నాటౌట్‌, 112) సాధించాడు. అంతకుముందు శ్రీలంక సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేసి (70, 21, 116) ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్‌, డికాక్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ నాలుగో స్థానంలో ఉండగా, పాక్‌ ప్లేయర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

కాగా న్యూజిలాండ్‌ సిరీస్‌ (2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)తో పాటు అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు) అద్భుతంగా రాణించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మొదటిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించాడు. వన్డే టాప్ టెన్ బౌలర్లలో భారత్ తరుపున కేవలం సిరాజ్ మాత్రమే ఉండడం గమనార్హం. ఇక రెండో స్థానంలో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌ వుడ్‌, మూడో స్థానంలో కివీస్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, నాలుగో స్థానంలో మిచెల్‌ స్టార్క్‌, ఐదో స్థానంలో రషీద్‌ ఖాన్‌ కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu