Rohit-Ritika Love Story: యాడ్ ద్వారా పరిచయం..యువీ వార్నింగ్..రోహిత్ – రితికాల లవ్‌స్టోరీలో ఎన్నెన్నో ట్విస్ట్‌లు

Surya Kala

Surya Kala |

Updated on: Sep 06, 2021 | 4:17 PM

Rohit Sharma Ritika Love Story: సామాన్యులవైనా, సెలబ్రెటీలవైనా , సినిమాలైనా ప్రేమ కథలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి.  కొంతమంది దంపతులను చూడడగానే ఎంత చక్కగా ఉందఈ జంట అనిపించక..

Rohit-Ritika Love Story: యాడ్ ద్వారా పరిచయం..యువీ వార్నింగ్..రోహిత్ - రితికాల లవ్‌స్టోరీలో ఎన్నెన్నో ట్విస్ట్‌లు
Rohit Ritika

Follow us on

Rohit Sharma Ritika Love Story: సామాన్యులవైనా, సెలబ్రెటీలవైనా , సినిమాలైనా ప్రేమ కథలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి.  కొంతమంది దంపతులను చూడడగానే ఎంత చక్కగా ఉందఈ జంట అనిపించక మానదు. అలాంటి చూడముచ్చటైన జంటల్లో ఒకరు భారత స్టార్ క్రికెటర్ రోహత్ శర్మ, రితికా సింగ్ దంపతులు. ఎంతో చూడముచ్చటగా ఉండే వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమ పెళ్లి.. యువరాజ్ సింగ్ రోహిత్ శర్మకు ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. ముంబై లో పుట్టి పెరిగిన తెలుగుకుర్రాడు రోహిత్ శర్మ కు రితికా సింగ్ పరిచయం ఎలా జరిగింది. రోహిత్ శర్మకు యువరాజ్ సింగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసుకుందాం..

హిట్రో మ్యాన్ రోహిత్ శర్మ​కు రితికా సింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఈ సమయంలో  వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత మరికొంతకాలం డేటింగ్‌లో ఉండి .. చివరిగా 2015లో పెళ్లి చేసుకున్నారు. అసలు రోహిత్ శర్మకు రితిక పరిచయం ఓ యాడ్ షూట్ సమయంలో జరిగింది. రితిక భారత​ మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​కు సోదరి వరుస అవుతుంది. దీంతో రోహిత్ శర్మ ను రితికకు దూరంగా ఉండమని యువరాజ్ సింగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ సమయంలో రితిక రోహిత్ శర్మకు మేనేజర్ అయ్యింది. ఇలా మొదలైన వీరి జర్నీ.. స్నేహం ప్రేమ, డేటింగ్ ఇలా అనేక రూపాలతో సాగి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.  అయితే వివాహానికి ముందు వీరు డేటింగ్‌లో ఉన్న విషయం చాలా సీక్రెట్‌గా ఉంచారు

అయితే రితికా సజ్దే‌ తన వద్ద మేనేజర్‌గా పనిచేసే సమయంలో మేము ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం.. అంతేకాని మా మధ్య మరే ఆలోచన లేదు..   ముందు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధంలేదు. అసలు మాకు ఆలోచన కూడా లేదు. కేవలం వర్క్‌కు సంబంధించిన రిలేషన్ ఉంది అంతే.. అయితే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను చూసి చాలామంది మమ్మల్ని మంచి జంట అని అనేవారు..  మీరిద్దరూ క్యూట్ కపుల్‌గా ఉన్నారని..  మీ ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనేవారు అయితే మేము ఆ కామెంట్స్ ను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. అసలు పట్టించుకోలేదు.. అంతేకాదు తిరిగి ,మా ఫ్రెండ్స్ మాటలను తప్పు పెట్టేవాడిని.. మేము జస్ట్ ప్రెండ్స్ మాత్రమే.. మా మధ్య లవ్ అంటూ ఏమీ లేదు అని వాదించేవాడిని.. అయితే కొన్నాళ్ళకు వారు చెప్పిందే నిజం అయింది. అప్పుడు మా మధ్య ఉన్న ప్రేమ బంధం గురించి ఎలా చెప్పాలని ఆలోచించా ఎందుకంటే.. స్నేహితులు మా మధ్య ప్రేమ ఉంది అంటే లేదు అని వాదించా అందుకని  చివరకు..  అఫిషియల్‌గా మేమిద్దరం డేటింగ్ చేసిన కొన్నాళ్లకు  స్నేహితులకు మా మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పానని రోహిత్ శర్మ.. రితిక పరిచయం ప్రేమ పెళ్లి గురించి గుర్తు చేసుకున్నాడు.

rohith love story

ఇక  ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న  బొరివలీ స్పోర్ట్​ గ్రౌండ్​లో రోహిత్ శర్మ రితికకు ప్రపోజ్ చేశాడు.  ఆ తర్వాత 2015 జూన్​ 3న పెద్దల సమక్షంలో రోహిత్, రితిక ల నిశ్చితార్థం. 2015 డిసెంబరు 13న ముంబయిలోని తాజ్​ లాండ్స్​ హోటల్​లో కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.  ఈ దంపతులకు సమైరా అనే  ముద్దుల కూతురు ఉంది. సమైరా అంటే రోహిత్​కు ప్రాణం.  రోహిత్ శర్మ కు ఏ మాత్రం ఖాళీదొరికినా భార్య కూతురుతో గడపడానికి ఇష్టపడతాడు.. ఎప్పుడు కూతురు పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సందడి చేస్తూనే ఉంటాడు.

Also Read: Red Bhindi: ఎర్ర బెండకాయలను పండిస్తున్న రైతు.. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం.. లాభసాటి అంటున్న అన్నదాత

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu