Asia Cup 2023: సర్జరీ తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన టీమిండియా ఓపెనర్.. ఆసియాకప్‌తో బరిలోకి?

KL Rahul Injury Updates: ఐపీఎల్ 16వ సీజన్‌లో భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ తొడ గాయంతో బాధపడ్డాడు. క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Asia Cup 2023: సర్జరీ తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన టీమిండియా ఓపెనర్.. ఆసియాకప్‌తో బరిలోకి?
Team India Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Jun 11, 2023 | 5:53 PM

KL Rahul Injury Updates: భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడంపై కీలక అప్‌డేట్ అందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌లో గాయం కారణంగా రాహుల్ సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. అదే సమయంలో, అతను WTC ఫైనల్‌లో కూడా తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వీలైనంత త్వరగా మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

ఐపీఎల్ 16వ సీజన్‌లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తొడకు గాయం కావడంతో అతను దూరమయ్యాడు. దీంతో రాహుల్‌కు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉండే పనిలో పడ్డాడు. జూన్ 13 నుంచి కేఎల్ రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో తన పునరావాస ప్రక్రియను ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత అతను 2023 ఆసియా కప్‌కు పూర్తి ఫిట్‌గా ఉంటే తిరిగి జట్టులోకి రావొచ్చు. 2023 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా లోకేశ్ రాహుల్ పునరాగమనం టీమిండియాకు ఓదార్పునిచ్చే వార్తగా భావించవచ్చు. ఎందుకంటే రాహుల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్రను కూడా పోషించగలడు.

ఇవి కూడా చదవండి

వన్డే క్రికెట్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శన..

లోకేశ్ రాహుల్ 11 జూన్ 2016న భారత జట్టు తరపున వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో రాహుల్ తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ అద్భుత సెంచరీతో సత్తా చాటి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు తన వన్డే కెరీర్‌లో రాహుల్ 54 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలతో సహా 45.13 సగటుతో 1986 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..