WTC Final 2023: భారత్ ఘోర పరాజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసీస్‌దే.. ప్రపంచ క్రికెట్‌లో తొలిజట్టుగా సరికొత్త చరిత్ర..
IND Vs AUS WTC Final Match Report: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. చివరి రోజు తొలి సెషన్‌లోనే భారత జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 209 పరుగులు తేడాతో ఓటమి పాలైంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. చివరి రోజు తొలి సెషన్‌లోనే భారత జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 209 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. అద్భుత ఆటతీరు కనబరిచిన ఆస్ట్రేలియా టీం.. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ విజేతగా నిలిచింది. అలాగే ప్రపంచ క్రికెట్ లో ఐసీసీ మూడు ఫార్మట్లలో ట్రోఫీలను గెలుచుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర నెలకొల్పింది. ఈ అరుదైన అవకాశాన్ని టీమిండియా దక్కించుకోలేకపోయింది.
కీలక ఇన్నింగ్స్ ఆడతారని అనుకున్న శార్దూల్ ఠాకూర్ సున్నాతో ఔటయ్యాడు. అతను నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అజింక్య రహానే (46 పరుగులు) మిచెల్ స్టార్క్‌కు బలయ్యాడు. స్కోల్ బోలాండ్ ఒకే ఓవర్లో జడేజా (0 పరుగులు), విరాట్ కోహ్లీ (49 పరుగులు)లను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతకుముందు పుజారా 27, రోహిత్ 43, గిల్ 18 పరుగుల వద్ద ఔటయ్యారు.
నాలుగో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 270/8 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో చివరి మ్యాచ్‌లో భారత్‌కు 444 పరుగుల విజయ లక్ష్యం ఉంది. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంత పెద్ద లక్ష్య ఛేదన జరగలేదు.
#TeamIndia fought hard but it was Australia who won the match.
Congratulations to Australia on winning the #WTC23 Final.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/hMYuho3R3C
— BCCI (@BCCI) June 11, 2023
ఇరుజట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.