AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: సచిన్ కెప్టెన్సీలో అరంగేట్రం.. 2 నెలల్లో ముగిసిన కెరీర్.. కట్‌చేస్తే.. సూసైడ్ చేసుకున్న మాజీ క్రికెటర్..

Team India Former Cricketer David Johnson Suicide: డేవిడ్ జాన్సన్ భారత్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఢిల్లీలో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. అతని మొదటి బాధితుడు మైఖేల్ స్లేటర్. ఆ తర్వాత, అతను దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టులో అవకాశం పొందాడు. అక్కడ అతను రెండు వికెట్లు తీసుకున్నాడు.

Team India: సచిన్ కెప్టెన్సీలో అరంగేట్రం.. 2 నెలల్లో ముగిసిన కెరీర్.. కట్‌చేస్తే.. సూసైడ్ చేసుకున్న మాజీ క్రికెటర్..
Team India Former Cricketer David Johnson Suicide
Venkata Chari
|

Updated on: Jun 20, 2024 | 4:19 PM

Share

Team India Former Cricketer David Johnson Suicide: సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ కన్నుమూశారు. మీడియా నివేదికల ప్రకారం, డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను తన అపార్ట్మెంట్‌లోని నాల్గవ అంతస్తు నుంచి కిందికి దూకి, ఆ తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. డేవిడ్ జాన్సన్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. డేవిడ్ జాన్సన్ 1971 లో జన్మించాడు. అతని వయస్సు 52 సంవత్సరాలు. అతను బెంగళూరులో నివసిస్తున్నాడు. అతనికి క్రికెట్ అకాడమీ కూడా ఉండేది.

డేవిడ్ జాన్సన్ కెరీర్..

డేవిడ్ జాన్సన్ భారత్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఢిల్లీలో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. అతని మొదటి బాధితుడు మైఖేల్ స్లేటర్. ఆ తర్వాత, అతను దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టులో అవకాశం పొందాడు. అక్కడ అతను రెండు వికెట్లు తీసుకున్నాడు.

కేవలం 2 నెలల్లోనే ముగిసిన కెరీర్..

డేవిడ్ జాన్సన్‌కు కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అతను అక్టోబర్ 10, 1996న అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం డిసెంబర్‌లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతను టీమిండియా నుంచి దూరమయ్యాు. మరలా తిరిగి రాలేదు. డేవిడ్ జాన్సన్ కర్ణాటక తరపున రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. 39 మ్యాచ్‌ల్లో 125 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా 33 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 41 వికెట్లు తీశాడు. జాన్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా సెంచరీ చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 101 పరుగులు.

అకాడమీని నడిపించేవాడు..

డేవిడ్ జాన్సన్ బెంగుళూరులోనే ఒక అకాడమీని నడిపేవారు. అందులో జూనియర్ స్థాయి పిల్లలకు క్రికెట్ నేర్పించేవాడు. అతను క్రికెట్‌లో అమ్మాయిలను ప్రోత్సహించడంపై చాలా దృష్టి పెట్టాడు. అతని అకాడమీ 2020 సంవత్సరంలో ప్రారంభించారు. దాని అప్‌డేట్‌లను ఆయన తరచుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఈ ఆటగాడు ఎప్పుడు డిప్రెషన్‌లో పడిపోయాడో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో తాజాగా ప్రాణాలు తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్క డ క్లిక్ చేయండి..