- Telugu News Photo Gallery Cricket photos T20 world cup 2024 telugu phil salt most sixes by an england batter
T20 World Cup: 6,6,6,6,6.. సరికొత్త రికార్డుతో దడ పుట్టించిన కేకేఆర్ ఖతర్నాక్ ప్లేయర్..
Phil Salt Sixes Record: సూపర్-8 రౌండ్‌లో ఇంగ్లాండ్ తన మొదటి మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు 17.3 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
Updated on: Jun 20, 2024 | 3:48 PM

టీ20 ప్రపంచ కప్‌లోని 42వ మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ తుఫాన్ బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డును లిఖించాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం.

సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఇంగ్లండ్ జట్టుకు ఫిల్ సాల్ట్ తుఫాన్ ఆరంభాన్ని అందించాడు. తొలి ఓవర్ నుంచే భీకర బ్యాటింగ్ ప్రదర్శించిన సాల్ట్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఫలితంగా ఫిల్ సాల్ట్ బ్యాట్‌తో 5 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. అలాగే కేవలం 47 బంతుల్లోనే అజేయంగా 87 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు.

విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో 5 భారీ సిక్సర్లు బాదిన ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ తరపున టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇయాన్ మోర్గాన్ పేరిట ఉండేది.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ న్యూజిలాండ్‌పై 26 సిక్సర్లు కొట్టి ఈ రికార్డును లిఖించాడు. ఫిన్ సాల్ట్ ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 క్రికెట్‌లో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన ఫిల్ సాల్ట్ మొత్తం 32 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లండ్ తరపున ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా ఫిల్ సాల్ట్ రికార్డు సృష్టించాడు.




