AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు రిషబ్ పంత్ దూరం? గాయంపై కీలక అప్‌డేట్..

Rishabh Pant Injury Update India vs Afghanistan Match: టీ20 వరల్డ్ కప్ 2024లో, టీమ్ ఇండియా సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్‌తో తన మొదటి మ్యాచ్ నేడు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు, ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడతాడా లేదా అన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారింది.

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు రిషబ్ పంత్ దూరం? గాయంపై కీలక అప్‌డేట్..
Rishabh Pant
Venkata Chari
|

Updated on: Jun 20, 2024 | 5:54 PM

Share

Rishabh Pant Injury Update India vs Afghanistan Match: టీ20 వరల్డ్ కప్ 2024లో, టీమ్ ఇండియా సూపర్-8లో ఆఫ్ఘనిస్తాన్‌తో తన మొదటి మ్యాచ్ నేడు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు, ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడతాడా లేదా అన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నగా మారింది.

మీడియా నివేదికల ప్రకారం, ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ బొటనవేలు, చేతికి గాయమైంది. అయినప్పటికీ, అతను బ్యాటింగ్ కొనసాగించి తన ప్రాక్టీస్ పూర్తి చేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ కనిపించడం లేదని, అయితే మిగతా టీమ్ ఇండియా ఆటగాళ్లు హాజరయ్యారని మరో రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే, ఆ తర్వాత పంత్ నెట్స్‌లో లాంగ్ షాట్‌లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

రిషబ్ పంత్ గాయపడినా ఇప్పటి వరకు నెట్స్‌లో బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడవచ్చునని అనిపిస్తోంది. అతని గాయం చాలా తీవ్రంగా లేదని తెలుస్తోంది. అందుకే అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని భావిస్తున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన..

2024 టీ20 ప్రపంచకప్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన చాలా బాగుంది. పంత్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 96 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా కనిపించాడు. అలాగే, అద్భుతమై ఫాంలో కూడా కనిపించాడు. ఇటువంటి పరిస్థితిలో, పంత్ తన బ్యాట్‌తో ఆఫ్ఘనిస్తాన్‌పై విధ్వంసం సృష్టించగలడు. రిషబ్ పంత్‌కు ఎలాంటి గాయాలు తగలడం భారత జట్టు ఇష్టపడదు. టోర్నీ మొత్తం ఆడటం చాలా ముఖ్యం. మిడిల్ ఆర్డర్‌లో భారత జట్టుకు ఎంతో కీలకంగా మారాడు.

సూపర్ -8లో భారత జట్టుకి ఇది మొదటి మ్యాచ్. టీమ్ ఇండియా ఈ రౌండ్‌ను విజయంతో ప్రారంభించాలనుకుంటుంది. ఈ క్రమంలో పంత్ గాయపడి, మ్యాచ్‌కు దూరమైతే, భారత జట్టుకు చాలా ఇబ్బందిగా మారుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ జట్టు కూడా భారత్‌ను ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆఫ్ఘాన్ ఆటగాళ్లు కూడ ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ చూడవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..