Team India: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కరోనా ఎఫెక్ట్ .. ఐసోలేషన్ లో ఒక క్రికెటర్

Team India: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లలో ఒకరికి కరోనా సోకినట్టు బీసీసీఐ వెల్లడించింది. నిజానికి ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ఒక క్రికెటర్ కు ఆ తరువాత నెగెటివ్ రిపోర్టు వచ్చింది.

Team India: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కరోనా ఎఫెక్ట్ .. ఐసోలేషన్ లో ఒక క్రికెటర్
Team India
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: KVD Varma

Updated on: Jul 15, 2021 | 10:53 AM

Team India: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లలో ఒకరికి కరోనా సోకినట్టు బీసీసీఐ వెల్లడించింది. నిజానికి ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. ఒక క్రికెటర్ కు ఆ తరువాత నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మరో క్రికెటర్ మాత్రం క్వారంటైన్ లో ఉన్నాడు. అతనికి మళ్లీ జూలై 18వ తేదీన కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా సోకిన ఇద్దరు క్రికెటర్లకు ఎటువంటి లక్షణాలు కనిపించలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ క్రికెటర్ల పేర్లను వారు వెల్లడించలేదు. కొద్దిరోజుల క్రితం ఆ క్రికెటర్లు ఇద్దరూ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కనిపించారని ఇంగ్లాండ్ మీడియా చెబుతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు అందరూ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరు తమ రెండో మోతాదును ఇంగ్లాండ్ లో తీసుకోవాల్సి ఉంది.

గత నెల ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పోటీ తరువాత ఇంగ్లాండ్ టీమ్ తో భారత జట్టు టెస్ట్ సిరీస్ లో తలపడాల్సి ఉంది. అయితే, దీనికి 40 రోజుల పైగా సమయం ఉండడంతో టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీంతో పాటూ వారు యూకేలో ఎక్కడైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు ఇంగ్లాండ్ లోని పలు ప్రాంతాల్లో కుటుంబాలతో సహా తిరిగారు. కొంతమంది వింబుల్డన్, యూరోకప్ వంటి క్రీడల పోటీలను చూడటానికి వెళ్లారు. ఈ క్రికెటర్లు అంతా జూలై 14 న జట్టులో చేరాల్సి ఉంది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కూడా..

పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు కేవలం రెండు రోజుల ముందు జూలై 6 న ఇంగ్లాండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు కూడా వ్యాధి సోకింది. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆటగాళ్లతో సహా 7 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీని తరువాత అందరూ ఐసోలేషన్ లో ఉన్నారు. పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో సరికొత్త జట్టును రంగంలోకి దించారు. అయితే, కరోనా సోకిన ఆటగాళ్లందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు.

దీని తరువాత, కరోనాకు సంబంధించి ఇంగ్లాండ్ జట్టులో పరిస్థితుల గురించి భారత జట్టు యాజమాన్యానికి తెలుసునని బిసిసిఐ తెలిపింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ (ఇసిబి) షెడ్యూల్ మార్చమని లేదా కొత్త ప్రోటోకాల్ ఇవ్వమని అడిగితే, మేము దానిని అనుసరిస్తాము. ప్రస్తుతం, షెడ్యూల్‌లో మార్పులు చేయలేదు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ”ప్రతి పరిస్థితులపై మేము నిశితంగా గమనిస్తున్నాము. క్రీడాకారుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది. కరోనా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఆటగాళ్లను పరీక్షిస్తున్నారు. రెండవ ఆటగాడిని జూలై 18 న పరీక్షించనున్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత, వారు జట్టుతో ప్రాక్టీస్ చేయగలరు.” అంటూ ఆ వర్గాలు పేర్కొన్నాయి.

టీం ఇండియా జూలై 20 నుంచి 22 వరకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడవలసి ఉంది. కౌంటీ ఛాంపియన్‌షిప్ XI జట్టుతో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. దీని తరువాత ఆ గస్టు 4 నుంచి ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడవలసి ఉంది. మొదటి మ్యాచ్ ఆగస్టు 4 న నాటింగ్‌హామ్‌లో ప్రారంభమవుతుంది.

Also Read: Rohit sharma: వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు..!

MS Dhoni: స్నేహితులతో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంఎస్ ధోనీ.. న్యూలుక్‌లో అదుర్స్.. ఫ్యాన్స్ ఫిదా..

మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!