AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: రిషబ్ పంత్ కు కరోనా పాజిటివ్.. స్నేహితుని ఇంటిలో ఐసోలేషన్ లో క్రికెటర్..ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరం?

Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక క్రికెటర్ కరోనాతో ఐసోలేషన్ లో ఉన్నాడనే విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ వర్గాలు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఆ సభ్యుని పేరు చెప్పలేదు.

Rishabh Pant: రిషబ్ పంత్ కు కరోనా పాజిటివ్.. స్నేహితుని ఇంటిలో ఐసోలేషన్ లో క్రికెటర్..ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరం?
Rishabh Pant
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2021 | 1:00 PM

Share

Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక క్రికెటర్ కరోనాతో ఐసోలేషన్ లో ఉన్నాడనే విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ వర్గాలు ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ఆ సభ్యుని పేరు చెప్పలేదు. కొద్దిసేపటి క్రితమే ఆ సభ్యుని పేరును బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. భారత వికెట్ కీపర్ – బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ కరోనా పాజిటివ్ వచ్చిందని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. ఇప్పుడు రిషబ్ పంత్ భారత జట్టుతో పాటు టెస్ట్ సిరీస్ లో పాల్గోవటానికి డార్హాం వెళ్లడం లేదని పీటీఐ తెలిపింది.

పీటీఐ వార్తా సంస్థ చెబుతున్న దాని ప్రకారం, రిషబ్ పంత్ కరోనా పాజిటివ్‌ రావడంతో గత ఎనిమిది రోజులుగా ఒంటరిగా ఉన్నట్లు బిసిసిఐ వర్గాలు ధృవీకరించాయి. అయితే, అతనికి ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవు. పంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత అతను ఒక పరిచయస్థుడి వద్ద ఐసోలేషన్ లో ఉన్నాడు. భారత జట్టు గురువారం డర్హాం వెళ్లాల్సి ఉంది. ఆ జట్టుతో పంత్ ప్రయాణించడు. అని క్రికెట్ వర్గాలు చెప్పాయి. అంతే కాకుండా పంత్ ఎప్పుడు జట్టుతో చేరతాడనే విషయమూ ఇంకా స్పష్టం కాలేదు.

పంత్ డెల్టా వేరియంట్‌తో పంత్ బాధపడ్డాడని తెలుస్తోంది. ఈ వేరియంట్ ఇంగ్లాండ్‌లో కేసుల సంఖ్య పెరగడానికి దారితీసింది. కాగా, రిషబ్ గత నెలలో యూరో 2020 మ్యాచ్‌కు హాజరయ్యాడు. అతని సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాలను కూడా పోస్ట్ చేశాడు.

ప్రస్తుతానికి మారే క్రికెటర్ పాజిటివ్ గా లేరని, ఇప్పటికే కరోనా ప్రోటోకాల్ పాటించమని ఆటగాళ్లందరికీ బీసీసీఐ కార్యదర్శి జే షా ఇప్పటికే లేఖ రాశారని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. బిసిసిఐ కార్యదర్శి జే షా తన లేఖలో, కోవిషీల్డ్, జట్టుకు ఇచ్చిన టీకా, రక్షణను మాత్రమే అందిస్తుంది, వైరస్ కు వ్యతిరేకంగా పూర్తి రోగనిరోధక శక్తిని కలిగి ఉండదు. అందువల్ల రద్దీగా ఉండే ప్రదేశాలను ‘నివారించాలని’ భారత బృంద సభ్యులను కోరారు.

పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు కేవలం రెండు రోజుల ముందు జూలై 6 న ఇంగ్లాండ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు కూడా వ్యాధి సోకింది. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆటగాళ్లతో సహా 7 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీని తరువాత అందరూ ఐసోలేషన్ లో ఉన్నారు. పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో సరికొత్త జట్టును రంగంలోకి దించారు. అయితే, కరోనా సోకిన ఆటగాళ్లందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు.

దీని తరువాత, కరోనాకు సంబంధించి ఇంగ్లాండ్ జట్టులో పరిస్థితుల గురించి భారత జట్టు యాజమాన్యానికి తెలుసునని బిసిసిఐ తెలిపింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ (ఇసిబి) షెడ్యూల్ మార్చమని లేదా కొత్త ప్రోటోకాల్ ఇవ్వమని అడిగితే, మేము దానిని అనుసరిస్తాము. ప్రస్తుతం, షెడ్యూల్‌లో మార్పులు చేయలేదు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ”ప్రతి పరిస్థితులపై మేము నిశితంగా గమనిస్తున్నాము. క్రీడాకారుల భద్రత మాకు చాలా ముఖ్యమైనది. కరోనా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఆటగాళ్లను పరీక్షిస్తున్నారు. రెండవ ఆటగాడిని జూలై 18 న పరీక్షించనున్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత, వారు జట్టుతో ప్రాక్టీస్ చేయగలరు.” అంటూ ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Rohit sharma: వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు..!

Anushka – Sakshi: అనుష్క, సాక్షి, ప్రియాంక, రితికా సజ్దేహ్ : టీమిండియా స్టార్ క్రికెటర్ల భార్యలు ఎంత వరకు చదివారో తెలుసా..!