Virat Kohli – anushka sharma: వీళ్ల బాడీగార్డ్ శాలరీ.. టాప్ కంపెనీల సీఈఓలు కూడా షాకవ్వాల్సిందే!

సెలబ్రిటీలు బహిరంగంగా తిరగాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు వారు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పెట్టుకుంటారని తెలిసిందే. అయితే వీరి శాలరీలను పరిశీలిస్తే.. సెలబ్రిటీల హోదాలను బట్టి హెచ్చుతగ్గులుంటాయి.

Virat Kohli - anushka sharma: వీళ్ల బాడీగార్డ్ శాలరీ.. టాప్ కంపెనీల సీఈఓలు కూడా షాకవ్వాల్సిందే!
Virat Kohli Anushka Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 15, 2021 | 3:25 PM

Virat Kohli – anushka sharma: సెలబ్రిటీలు బహిరంగంగా తిరగాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు వారు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పెట్టుకుంటారని తెలిసిందే. అయితే వీరి శాలరీలను పరిశీలిస్తే.. సెలబ్రిటీల హోదాలను బట్టి హెచ్చుతగ్గులుంటాయి. కొంతమంది అయితే భారీగా జీతాలు ఆఫర్లు చేసి మరీ బాడీగార్డులను మెయింటేన్ చేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల బాడీగార్డుపై ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇతనికి ఇచ్చే శాలరీని చూసి జనాలు షాకవతున్నారు. ఇలా విరుష్కలు ప్రతిరోజూ నెట్టింట్లో ఏదో ఒక వార్తతో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ బాడీ గార్డ్‌ ప్రకాశ్ సింగ్ అకా సోనూను హైర్ చేసుకుంది. అయితే, మొదట అనుష్క శర్మ పర్సనల్ బాడీగార్డ్‌గా పనిచేసిన ఆయన.. పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ-అనుష్క శర్మకి కూడా సేవలందిస్తున్నాడు.

అయితే సోనూ సేవలకు విరుష్క జోడీ భారీ మొత్తంలో శాలరీ ఇస్తోందంట. అతనికి చెల్లించే శాలరీ.. బడా కంపెనీల సీఈవోలు కూడా వెనుకంజలోనే ఉంటారంట. సోనుకు రూ.1.2 కోట్లు ఇస్తున్నారంట. అంటే నెలకు దాదాపు రూ. 8.50 లక్షలు అందనున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో కోహ్లీ బాడీగార్డ్ శాలరీ హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంత జీతమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఎన్నో వేల కోట్లు ఆర్జిస్తున్న వీరికి సోనూ జీతమో లెక్కా? అంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరు. విరుష్క జోడీ బాడీ గార్డ్‌గా ఉద్యోగం లభించినా బాగుండని వాపోతున్నారు కొందరు. కాగా, బాడీగార్డు సోనూను అనుష్క, విరాట్ జోడీ కుటుంబంలో ఒకడిగానే చూసుకుంటారని టాక్. ఈమేరకు సోను పుట్టుని రోజు వేడుకులను కూడా వీరు సెలబ్రేట్ చేసుకున్నారంట. ఇందుకు చక్కని ఉదాహరణ.. షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించి జీరో సినిమాలో నటిస్తున్న సమయంలో.. సోనూ పుట్టిన రోజు వస్తే.. అక్కడే వేడుకలు నిర్వహించారు అనుష్క శర్మ. అలాగే అనుష్క ప్రెగ్నెన్సీ సమయంలోనూ, కరోనా సమయంలోనూ సోనూ కుటుంబ సభ్యుడిలానే ఆమెకు సేవలందించాడంట. అయితే, ప్రస్తుతం విరుష్కల గారాల పట్టి వామికా బాధ్యతలు కూడా సోనూనే చూసుకుంటున్నాడంట. కాగా, ఇప్పటి వరకు వామికా ఫొటోను సోషల్ మీడియాలో విడుదల చేయకుండా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఇంకెప్పుడు ఫేస్ చూపిస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Tokyo Olympics 2021: ‘చీర్‌4ఇండియా’ సాంగ్ విడుదల.. అదరగొట్టిన ఏఆర్ రహమాన్, అనన్య! భారత అథ్లెట్లకు మద్దతు నిలవాలంటూ ఐఓఏ పిలుపు

MS Dhoni: స్నేహితులతో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంఎస్ ధోనీ.. న్యూలుక్‌లో అదుర్స్.. ఫ్యాన్స్ ఫిదా..

Rohit sharma: వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.