IND vs SL: లేటు వయసులో కెప్టెన్‌లయ్యారు.. ఏజ్ నాట్ ఏ మ్యాటర్ అంటోన్న భారత సీనియర్ ప్లేయర్.. అందని చూపు ఆయన పైనే..!
ఎనిమిదేళ్లుగా టీమిండియాలో ఆడుతున్నా.. కెప్టెన్సీ అవకాశం రాలేదు. కానీ, ప్రస్తుతం టీమిండియా సీనియర్ల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో జట్టు వెళ్లాల్సి వచ్చింది. దాంతో సీనియర్ ఆటగాడిగా శిఖర్ ధావన్‌కి తొలిసారిగా టీమిండియాను నడిపించే అవకాశం వచ్చింది.
Ind vs Sl: ఎనిమిదేళ్లుగా టీమిండియాలో ఆడుతున్నా.. కెప్టెన్సీ అవకాశం రాలేదు. కానీ, ప్రస్తుతం టీమిండియా సీనియర్ల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో జట్టు వెళ్లాల్సి రావడంతో.. సీనియర్ ఆటగాడిగా శిఖర్ ధావన్‌కి తొలిసారిగా టీమిండియాను నడిపించే అవకాశం వచ్చింది. అయితే, ప్రస్తుతం జులై 18 నుంచి మొదలుకాబోయే వన్డే సిరీస్‌లో మొదటిసారి కెస్టెన్సీ చేయబోతున్న శిఖర్ ధావన్‌పైనే అందరి చూపు ఉంది. అలాగే ఈ సిరీస్‌తో రాహుల్ ద్రవిడ్ కూడా తొలిసారి టీమిండియాకు కోచ్‌గా వ్యవహచించనున్నాడు. ఈ ఇద్దరికీ తొలిసారి అవకాశం రావడంతో.. భారత అభిమానులంతా ఈ సీనియర్లవైపే చూస్తున్నారు. ఓ సీనియర్ ప్లేయర్‌గా టీమిండియాను ఎలా నడిపించబోతాడోనని చూస్తున్నారు. మూడు ఫార్మాట్లలో భారత్ తరపున ఆడుతున్న శిఖర్.. తనదైన మార్క్‌ను చూపించాడు. 2010లో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన శిఖర్ ధావన్.. రెండవ బంతికే ఔట్ అయ్యి నిరాశపరిచాడు.
రెండేళ్ల తరువాత 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ బరిలోకి దిగిన శిఖర్.. టోర్నెమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా ట్రోఫీని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి టీమిండియాకు మంచి ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్- రోహిత్ శర్మ రూపంలో లభించింది. ఇప్పటికీ ఈ జోడీ చాలా బలంగానే కనిపిస్తోంది.
జులై 18న వన్డే కెప్టెన్సీగా మైదానంలో దిగనున్న శిఖర్ ధావన్.. 35 సంవత్సరాల 225 రోజుల వయసులో ఉంటాడు. 1984లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా మొహిందర్ అమర్‌నాథ్ తొలిసారి భారత టీంకు సారథ్యం వహించాడు. అప్పుడు ఆయన 34 ఏళ్ల 37 రోజుల వయసులో కెప్టెన్ అయి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ అమర్‌నాథ్ నెలకొల్పిన రికార్డును శిఖర్ ధావన బద్దలు కొట్టాడు.
శిఖర్ కంటే ముందు అత్యధిక వయసులో కెప్టెన్‌గా చేసిన భారత ఆటగాళ్లు:
- మొహిందర్ అమర్‌నాథ్ (34 ఏళ్ల 37 రోజులు) vs పాకిస్తాన్ (సియాల్‌కోట్, 1984 లో)
- సయ్యద్ కిర్మాని (33 ఏళ్ల 353 రోజులు) vs వెస్టిండీస్ (గువహతి, 1983 లో )
- అజిత్ వాడేకర్ (33 ఏళ్ల 103 రోజులు) vs ఇంగ్లండ్ (లీడ్స్, 1974 లో)
ఎన్నో ఏళ్లుగా శిఖర్ ధావన్ ఎదురుచూస్తోన్న అవకాశం శ్రీలంక పర్యటన రూపంలో వచ్చింది. తనమార్క్ చూపించేందుకు ఆరాటపడుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ జులై 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి వచ్చిన లంక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వన్డే సిరీస్‌ను జులై 18 నుంచి నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కూడా తొలిసారి టీమిండియా జట్టుకు కోచ్‌గా చేయనున్నాడు.
Also Read:
Virat Kohli – anushka sharma: వీళ్ల బాడీగార్డ్ శాలరీ.. టాప్ కంపెనీల సీఈఓలు కూడా షాకవ్వాల్సిందే!