AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోని సహచరుడు దంచేశాడు..10 బంతుల్లో 52 పరుగులు.. 6 సిక్సులు.. 4 ఫోర్లు

ధోని ఐపీఎల్ టీంలోని ప్లేయర్ మైదానంలో అడుగుపెట్టినప్పుడు టీం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లాభంలేదనుకొని బౌలర్లపై దాడి చేశాడు. ఉన్న కొద్దిసేపు భీభత్సం సృష్టించాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

MS Dhoni: ధోని సహచరుడు దంచేశాడు..10 బంతుల్లో 52 పరుగులు.. 6 సిక్సులు.. 4 ఫోర్లు
Ms Dhoni Csk
Venkata Chari
|

Updated on: Jul 15, 2021 | 5:39 PM

Share

టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడింది. దాంతో ఆటగాళ్లు కూడా తమ బ్యాట్‌లకు పదును పెడుతున్నారు. అలాగే బౌలర్లు కూడా వికెట్లను పడగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అసాధారణ ప్రతిభ చూపేందుకు ఉన్న వనరులను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ సాధారణ ఆటను ఆడేశాడు క్రికెట్ లెజెండ్ ధోనీ సహచరుడు. ఈయన మైదానంలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బౌలర్లు సత్తా చూపుతున్న వేళ.. రంగంలోకి దిగిన ఆయన.. ప్రతీ బంతిని ఊచకోత కోశాడు. దాంతో 5 టీ20ల సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయనెవరో కాదు ఇండియన ప్రీమియర్ లీగ్‌లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని రైజింగ్ పూణే సూపర్‌జైంట్స్‌లో భాగమైన మిచెల్ మార్ష్.

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ జరుగుతోంది. ఇందులో వెస్టిండీస్‌ టీం ఇప్పటికే మూడు మ్యాచులు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే నిన్న జరిగిన నాలుగో మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయ యాత్రకు ఆస్ట్రేలియా ఆటగాడు అడ్డుకట్ట వేశాడు. ఇందుకు ఆస్ట్రేలియా టీం కచ్చితంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. కారణం సిరీస్ వైట్‌వాష్ కాకుండా కాపాడినందుకు. నాలుగో టీ20లో వెస్టిండీస్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. మిచెల్ మార్ష్ 44 బంతుల్లో 75 పరుగులు చేశాడు. కాగా, ఇందులో 52 పరుగులను కేవలం 10 బంతుల్లో 6 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో పూర్తి చేసి, ఆస్ట్రేలియా టీం భారీ స్కోర్ సాధించేందుకు సహాయపడ్డాడు. అలాగే వెస్టిండీస్ టీం టార్గెట్ ఛేదనలో లక్ష్యానికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా బాల్‌తో సత్తా చాటి 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో టీ20లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇందులో మార్ష్ 75 పరుగులు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 53 పరుగులతో రాణించారు. వీరితో పాటు డాన్ క్రిస్టియన్ 14 బంతుల్లో 22 నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో హెడెన్ వాల్ష్ 3 వికెట్లు సాధించాడు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ టీం ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. సిమన్స్ 48 బంతుల్లో 72 పరుగులు చేయగా, లూయిస్ 14 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం మిడిలార్డర్ చాలా ఘోరంగా విఫలమైంది. ఆండ్రీ రస్సెల్ 13 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫాబియన్ అలెన్ 14 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే రస్సెల్ చివరి ఓవర్లో పరుగులేమి చేయకపోవడంతో వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది.

Also Read:

IND vs SL: లేటు వయసులో కెప్టెన్‌లయ్యారు.. ఏజ్ నాట్ ఏ మ్యాటర్ అంటోన్న భారత సీనియర్ ప్లేయర్.. అందని చూపు ఆయన పైనే..!

Virat Kohli – anushka sharma: వీళ్ల బాడీగార్డ్ శాలరీ.. టాప్ కంపెనీల సీఈఓలు కూడా షాకవ్వాల్సిందే!