- Telugu News Photo Gallery Cricket photos Ind vs sl prithvi shaw shikhar dhawan likely to open innings suryakumar at third place
IND Vs SL: కోహ్లీ ప్లేస్‌కు భారీ పోటీ.. రేసులో ముగ్గురు ఆటగాళ్లు.. వారికి మొండిచేయి.!
IND Vs SL: మరో మూడు రోజుల్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమితి ఓవర్ల సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్ నిమిత్తం ఓపెనర్ శిఖర్ ధావన్‌లో..
Updated on: Jul 15, 2021 | 6:27 PM

మరో మూడు రోజుల్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమితి ఓవర్ల సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్ నిమిత్తం ఓపెనర్ శిఖర్ ధావన్‌లో యువ జట్టు లంకకు వెళ్లగా.. తాజాగా తుది జట్టుపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

Ind vs sl

ఇక మూడో స్థానం అదే రెగుల్యర్ కెప్టెన్ కోహ్లీ ప్లేస్‌లో భారీ పోటీ నెలకొంది. నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి బెస్ట్ టీ20 ప్లేయర్స్ పోటీలో ఉండగా.. యాజమాన్యం సూర్యకుమార్ వైపే మొగ్గు చూపేలా ఉంది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్‌లకు చోటు ఖాయంలా కనిపిస్తోంది.

ఇక వికెట్ కీపర్ల రేసులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ పోటీ పడుతుంటే.. తుది జట్టులో శాంసన్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

స్పిన్నర్స్‌గా చాహల్, కృనాల్ పాండ్యా.. పేసర్లలో మిగిలిన స్థానాన్ని చేతన్ సకారియా భర్తీ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




