AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: స్నేహితులతో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంఎస్ ధోనీ.. న్యూలుక్‌లో అదుర్స్.. ఫ్యాన్స్ ఫిదా..

MS Dhoni: కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నై..

MS Dhoni: స్నేహితులతో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంఎస్ ధోనీ.. న్యూలుక్‌లో అదుర్స్.. ఫ్యాన్స్ ఫిదా..
Ms Dhoni
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2021 | 10:26 PM

Share

MS Dhoni: కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు దొరికిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తున్నాడు. ధోని సోషల్ మీడియాకు ఉన్నా.. అతని భార్య సాక్షి సింగ్ మాత్రం ఎప్పటికప్పుడు ధోనీ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మహీ నయా లుక్ ఫోటోలు, స్నేహితులతో సరదాగా గడుపుతున్న పోటోలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ టూర్‌ కంప్లీట్ చేసుకు స్వస్థలానికి వచ్చిన ధోనీ.. తాజాగా రాంచీలో ఓ హోటల్‌కు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తూ వారితో సరదాగా టైమ్‌పాస్ చేశాడు. తెల్లటి గడ్డం, కోర మీసాలతో చిరునవ్వులు నవ్వుతూ.. స్నేహితులతో ముచ్చటిస్తున్నాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు ms.dhoni.sr07 పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. మహేంద్ర సింగ్ ధోనీ న్యూ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌కి లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ధోనీ న్యూలుక్ ఫోటోను మీరూ చూసేయండి.

ఇదిలాఉంటే.. ఐపీఎల్ సీజన్ 14 తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ నెలలో యూఏఇలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లలో ధోనీ సారథ్యంలోని సీఎస్‌కె జట్టు ఐదు మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ టీమ్‌లు అన్నీ ఆగస్టు మూడవ వారంతో యూఏఈకి బయలుదేరనున్నాయి. అక్కడికి చేరుకున్న తరువాత టీమ్‌ల సభ్యులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తరువాత వారికి కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే మ్యాచ్‌లో ఆడేందుకు కొనసాగిస్తారు.

Also read:

RV 400 Bikes: ఎలక్ట్రిక్ బైక్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 28,000 తగ్గింపు.. రేపటి నుంచే బుకింగ్స్ ప్రారంభం..

Viral Video: అమ్మ బాబోయ్.. ఈ కోతి ముందు మందుబాబులు బలాదూరే.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Hyderabad City: హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..