RV 400 Bikes: ఎలక్ట్రిక్ బైక్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 28,000 తగ్గింపు.. రేపటి నుంచే బుకింగ్స్ ప్రారంభం..

RV 400 Bikes: రివాల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్ - ఆర్‌వి 400 కోసం బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని..

RV 400 Bikes: ఎలక్ట్రిక్ బైక్స్‌పై భారీ తగ్గింపు.. రూ. 28,000 తగ్గింపు.. రేపటి నుంచే బుకింగ్స్ ప్రారంభం..
Bike
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 14, 2021 | 10:18 PM

RV 400 Bikes: రివాల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్ – ఆర్‌వి 400 కోసం బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, పూణే, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో బుకింగ్స్‌ని మళ్లీ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. జూలై 15, 2021 న మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. మొదటి సారి ఈ బైక్స్ కోసం బుకింగ్స్ ప్రారంభించగా.. ఊహించని రీతిలో స్పందన లభించింది. దాంతో కంపెనీ మరోసారి బుకింగ్స్‌ ప్రారంభిస్తోంది.

ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయించామని కంపెనీ వెల్లడించింది. గతంలో బుకింగ్స్ ప్రారంభం అయిన రెండు గంటల లోపే బుకింగ్స్‌ని క్లోజ్ చేయాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. బుక్ చేసిన ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ డెలివరీలు సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభమవుతాయని రివాల్ట్ మోటార్స్ తెలిపింది. ఆసక్తిగల వినియోగదారులు RV400 ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే.. కంపెనీ వెబ్‌సైట్ www.revoltmotors.com కి వెళ్లి ‘నోటిఫై మి’ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

రివాల్ట్ RV400 ఫీచర్లు.. రివాల్ట్ RV400 కి 3KW (మిడ్ డ్రైవ్) మోటారు లభిస్తుంది. ఇది 72V, 3.24KWh లిథియం-అయాన్ బ్యాటరీతో యాడ్ చేశారు. ఈ బైక్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాదు.. దీనికి అత్యాధునిక టెక్నాలజీని కూడా అమర్చారు. ఈ బైక్ ‘మై రివోల్ట్’ యాప్‌కు అనుసంధానించబడుతుంది. లొకేషన్ / జియో-ఫెన్సింగ్, ఇతర వివరాలను ఈ యాప్‌ ద్వారా మానిటరింగ్ చేయొచ్చు. అలాగే, బైక్ పరిస్థితి, బ్యాటరీ లెవెల్స్, రైడ్, చార్జింగ్ స్టేషన్ వివరాలు సహా ఇతర వివరాలను ఈ యాప్ తెలుపుతుంది. రివాల్ట్ RV400 ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో విడుదల అవుతోంది. సస్పెన్షన్ సిస్టమ్‌లో అప్‌సైడ్-డౌన్(యుఎస్‌డి) ఫోర్క్స్ అప్-ఫ్రంట్. అలాగే వెనుక భాగంలో పూర్తిగా సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉన్నాయి.

రూ. 28,000 తగ్గుదల.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫేమ్ II పథకంలో తాజా సవరణ తరువాత రివాల్ట్ తన ఆర్‌వి 400 ఫై భారీ తగ్గింపును ప్రకటించింది. 28,000 రూపాయల భారీ ధర తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ బైక్ ఎక్స్‌షోరూమ్‌లో 90,799 రూపాయలకు లభించనుంది.

Also read:

Viral Video: అమ్మ బాబోయ్.. ఈ కోతి ముందు మందుబాబులు బలాదూరే.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Hyderabad City: హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..