AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మ బాబోయ్.. ఈ కోతి ముందు మందుబాబులు బలాదూరే.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Monkey Video: కరేబియన్‌లోని సెయింట్ కిట్స్ ద్వీపంలో నివసిస్తున్న 'తాగుబోతు' కోతుల కథలను ఇప్పటి వరకు విన్నాం. ఈ కోతులు అక్కడికి వచ్చే..

Viral Video: అమ్మ బాబోయ్.. ఈ కోతి ముందు మందుబాబులు బలాదూరే.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Monkey
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2021 | 9:15 PM

Share

Monkey Video: కరేబియన్‌లోని సెయింట్ కిట్స్ ద్వీపంలో నివసిస్తున్న ‘తాగుబోతు’ కోతుల కథలను ఇప్పటి వరకు విన్నాం. ఈ కోతులు అక్కడికి వచ్చే పర్యాటకుల నుండి మద్యం బాటిళ్లను దొంగించి.. వాటిని గటగటా తాగేస్తాయి. అయితే, ఈ తాగుబోతు కోతులు.. విదేశాల్లోనే కాదు, మనదేశంలోనూ ఉన్నాయి. అడవిలో నివసించే ఒక కోతి.. రోజూ మద్యం దుకాణం వద్దకు వచ్చి, మద్యం సేవించి వెళుతోంది. ఈ విచిత్ర కోతికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

వైన్ షాపు నిర్వాహకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ మాండ్లా జిల్లాలోని బహమని బంజార్ గ్రామంలో ఓ మద్యం దుకాణం ఉంది. కహ్నా నేషనల్ పార్క్ సమీపంలోని అడవిలో నివసిస్తున్న కోతి.. వారం రోజుల క్రితం ఆ మద్యం దుకాణం వద్దకు వచ్చింది. అక్కడ తాగి పడేసిన మద్యం సీసాల్లో మిగిలిన మద్యం చుక్కలను టేస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆ కోతి.. వైన్ షాప్‌కు రెగ్యూలర్‌గా వస్తోంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగేది. అయితే, ఓ రోజు ఆ కోతి ఏకంగా వైన్‌ షాపులోకే ప్రవేశించింది. షాపులో వైన్ బాటిల్‌ను తీసుకుంది. అయితే, షాప్ నిర్వాహకులు దాన్ని అడ్డుకోగా.. వారిపై దాడి చేసింది. దాంతో చేసేదేమీ లేక.. ఆ కోతి చేష్టలను చూస్తూ నిలుచున్నారు.

మొత్తానికి ఓ మద్యం బాటిల్‌ను తీసుకున్న కోతి.. దానిని తాగేసింది. అలా రోజూ రావడం, మద్యం సేవించడం ఆ కోతికి పరిపాటిగా మారింది. కాగా, రోజూలాగే ఇవాళ కూడా వైన్ షాప్‌కు వచ్చిన కోతి.. ఓ విస్కీ ఫుల్ బాటిల్‌ను తీసుకుంది. అప్పటికే వైన్ షాపు నిర్వాహకులు దానికి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక ఆ కోతి దానంతట అదే విస్కీ బాటిల్ మూత ఓపెన్ చేసి మద్యాన్ని గట గటా తాగేసింది. అయితే, షాప్ నిర్వాహకులు దానికి స్నాక్స్ ఇవ్వగా తీసుకునేందుకు నిరాకరించింది. మద్యం తాగిన తరువాత ఆ కోతి.. అక్కడే ఉన్న గ్లాస్‌లోని వాటర్‌ను తాగింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్‌ కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Also read:

Hyderabad City: హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Mia Khalifa: మియా ఖలీఫాపై దేశాధ్యక్షుడు సంచలన ఆరోపణలు.. స్వచ్ఛందంగానే చేస్తానని బదులిచ్చిన మాజీ పోర్న్‌స్టార్..

Zolgensma: అరుదైన వ్యాధితో చిన్నారి.. ప్రాణాలు నిలవాలంటే రూ. 16 కోట్లు కావాలి.. దాతల చేతుల్లోనే చిన్నారి ప్రాణాలు..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు