Shreyas Iyer: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే భారీ షాక్.. ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్.!

Shreyas Iyer Injury: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి గాయం తీవ్రంగా ఉందని....

Shreyas Iyer: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే భారీ షాక్.. ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 24, 2021 | 4:21 PM

Shreyas Iyer Injury: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి గాయం తీవ్రంగా ఉందని.. కోలుకోవడానికి ఎక్కువ రోజులు సమయం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ వెల్లడించింది. కాగా, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో కొట్టిన బంతిని ఆపే క్రమంలో డైవ్ చేసిన శ్రేయాస్ అయ్యర్‌కు భుజం డిస్‌‌లోకేట్ అయిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో టీమిండియా ఫిజియోలు అతడ్ని వెంటనే అసుపత్రికి తరలించగా.. డాక్టర్లు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీనితో శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌లో ఆడటంపై సందిగ్దత నెలకొంది. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకపోతే.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఢిల్లీ జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉంది.

మొదటి వన్డేలో టీమిండియా గెలుపు…

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 318 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదించలేక పోయారు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు. 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది.  

అంతకు ముందు… ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 318 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్​మెన్​లో విరాట్, ధావన్, కృనాల్, రాహుల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ సేన అదరగొట్టింది.  5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 106 బంతుల్లో 98  పరుగులు చేశాడు. దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సెంచరీకి  2 పరుగుల దూరంలో ఔటయ్యాడు. సారథి విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడి అర్ధశతకం చేయగా… చివర్లో  కేఎల్‌ రాహుల్‌, కృనాల్‌ పాండ్య  మెరుపులు మెరిపించారు. సిక్సర్లతో దుమ్ము రేపారు. భారత ఆటగాళ్లను కట్టడి చేయడంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.  బెన్‌స్టోక్స్‌ 3, మార్క్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు. వన్డేల్లో ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన కృనాల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతడు చేసిన హాఫ్ సెంచరీని కొన్నాళ్ల క్రితం మరణించిన తండ్రికి అంకితమిచ్చాడు.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో