T20 World Cup Points Table 2022: గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరిన కివీస్, ఇంగ్లండ్.. ఇక అందరి చూపు గ్రూప్2 పైనే..
టీ20 ప్రపంచకప్ 2022లో గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం శ్రీలంకపై విజయం సాధించి సెమీస్ టికెట్ దక్కించుకుంది.
న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ 2022లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. శనివారం ఇంగ్లండ్ కూడా అదే గ్రూప్‌లోని శ్రీలంకను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ 1 నుంచి మొత్తంగా ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లతో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిన ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు మాత్రం టీ20 ప్రపంచ కప్‌లో భారీ షాక్ తగిలింది. సెమీస్ చేరుకోకుండానే సూపర్ 12 నుంచి నిష్క్రమించింది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కచ్చితంగా దేశవాళీ అభిమానుల హృదయాలను బద్దలు కొట్టింది.
ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు వెళ్లేందుకు సమీకరణాలు స్పష్టంగా కనిపించాయి. శ్రీలంకపై విజయంతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకి సెమీ ఫైనల్ టికెట్ ఖాయం చేసుకుంది. సిడ్నీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి ఆస్ట్రేలియా ప్రయాణానికి తెరపదించింది.
సెమీఫైనల్లో ఇంగ్లండ్..
న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ మాత్రమే కాగా, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఖాతాలో ఏడు పాయింట్లతో +2.113 నెట్-రేట్‌తో సెమీ-ఫైల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ జట్టు శనివారం ముందు ఐదు పాయింట్లను కలిగి ఉంది. కానీ, శ్రీలంకను ఓడించిన తర్వాత రెండు పాయింట్లను పొందింది. ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లను కలిగి ఉంది. అయితే ఆ టీం నెట్ రన్ రేట్ ఇంగ్లాండ్ కంటే తక్కువగా ఉంది. దీని కారణంగా ఆజట్టు క్వాలిఫైయింగ్‌లో విజయం సాధించలేకపోయింది.
ఆసక్తిగా గ్రూప్ 2 ఫలితాలు..
ఇప్పటికే గ్రూప్ 1 నుంచి కివీస్, ఇంగ్లండ్ టీంలు సెమీస్ చేరడంతో.. ఇక ఇప్పుడు అందరి చూపు గ్రూప్ 2 ఫలితాలపై ఆధారపడింది. రేపు జరగనున్న మూడు పోటీలతో సెమీస్ చేరే ఆ రెండు జట్లు ఏవో తెలియనున్నాయి. గ్రూప్ 1లో టీమిండియా ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. రేపు జింబాబ్వేతో కీలకమ్యాచ్ ఆడేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా సెమీస్ టికెట్ దక్కించుకుంటుంది. అలాగే సౌతాఫ్రికా టీం కూడా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ గెలిస్తే సెమీస్ చేరే రెండో జట్టుగా నిలవనుంది. అయితే, ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప భారీ మార్పులు చూడొచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..