ENG vs SL: ఆతిథ్య జట్టుకు భారీ షాక్.. లంకపై ఇంగ్లండ్ విజయంతో.. టోర్నీ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా..
టీ20 ప్రపంచకప్‌లో శనివారం సూపర్-12 గ్రూప్-1లో శ్రీలంకతో తలపడిన ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచి, సెమీస్ చేరుకుంది.
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు గెలిస్తే, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకునేది. కానీ ఫలితం వేరేలా రావడంతో, గత ఛాంపియన్ జట్టుకు నిరాశ తప్పలేదు. పాతుమ్ నిసంక బ్యాట్ నుంచి అత్యధిక పరుగులు వచ్చాయి. అతను 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అదే సమయంలో భానుక రాజపక్సే 22 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరపున మార్క్ వుడ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. చివరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇంగ్లండ్ జట్టు బాగా కష్టపడాల్సి వచ్చింది. వరుసగా వికెట్లు కోల్పోతూ, ఓ దశలో ఓటమిపాలవుతుందని అనిపించింది. కానీ, చివరకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 44 పరుగులతో అజేయంగా కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇరుజట్లు..
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..