T20 World Cup: ఆరేంటి.. 5 బంతులకే ఓవర్.. నిద్రపోయిన అంపైర్లు.. టీ20 ప్రపంచకప్‌లో తప్పిదం!
అడిలైడ్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో కంగారూ జట్టు గెలుపొందింది. ఇంతవరకు ఒక ఎత్తయితే.. ఈ మ్యాచ్‌లో పెద్ద తప్పిదం జరగడం మరో ఎత్తు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్, మార్ష్ క్రీజులో ఉన్న సమయంలో నాలుగో ఓవర్ ఆఫ్గనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి మిచిల్ మార్ష్ 3 పరుగులు రాబట్టగా.. స్కోర్ బోర్డుపై ఐదో బంతికి 3 రన్స్ వచ్చినట్లు ప్రత్యక్షమైంది.
ఇక ఆ తర్వాతి బంతి డాట్ బాల్ కావడంతో.. అంపైర్ 6 బాల్స్ అయ్యాయనుకుని ఓవర్ పూర్తి అయినట్లుగా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 4 ఓవర్ 5 బంతులకే క్లోజ్ అయింది. ఈ విషయం మ్యాచ్ అయ్యాక బయటికి రావడంతో నెటిజన్లు అంపైరింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌పై గెలిచినప్పటికీ.. నెట్ రన్‌రేట్‌లో మాత్రం వెనుకబడింది. ప్రస్తుతం ఆసీస్ నెట్ రన్‌రేట్(-0.173) ఉండటంతో.. కంగారూల జట్టు సెమీస్ చేరాలంటే.. రేపు ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో శ్రీలంక తప్పక గెలవాల్సిందే.




మరిన్ని క్రికెట్ వార్తల కోసం..




