Virat Kohli: 4 ఇన్నింగ్స్‌లు.. 205 పరుగులు.. 3 హాఫ్ సెంచరీలు.. కోహ్లీ కంబ్యాక్‌తో మారిన లెక్కలు..

టీమిండియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్.. టోర్నమెంట్‌లో కంబ్యాక్ ఇచ్చి.. జట్టు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. కోహ్లీ విజృంభణతో..

Virat Kohli: 4 ఇన్నింగ్స్‌లు.. 205 పరుగులు.. 3 హాఫ్ సెంచరీలు.. కోహ్లీ కంబ్యాక్‌తో మారిన లెక్కలు..
Virat Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 04, 2022 | 8:53 PM

విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పుడీ పేరే మారుమ్రోగుతోంది. ఇంతవరకు ఫామ్ లేమితో సతమతమైన ఈ టీమిండియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్.. టోర్నమెంట్‌లో కంబ్యాక్ ఇచ్చి.. జట్టు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. కోహ్లీ విజృంభణతో టీమిండియా ఆడిన మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్, అడిలైడ్ స్టేడియాలు ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ అయ్యాయి. ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మాజీ క్రికెటర్లు.. ఇతర జట్ల ఆటగాళ్లు కూడా కోహ్లీ నామస్మరణ చేస్తున్నారు. మనోడు ఆడే ఇన్నింగ్స్‌లకు అందరూ ఫిదా అయిపోతున్నారు.

గతేడాది టీ20 ప్రపంచకప్‌ టీమిండియా చేజార్చుకోవడం.. గడిచిన మూడేళ్లలో కోహ్లీ బ్యాట్ నుంచి 71వ శతకం రాకపోవడంతో.. ఇక జట్టులో కోహ్లీ ప్లేస్‌కు ఎసురు వచ్చేలా ఉందనే టాక్ నడిచింది. అయితేనేం.. మాటలు ఎన్నైనా అనొచ్చు.. కాని ఐసీసీ టోర్నమెంట్‌కు కోహ్లీ అప్రోచ్ కాస్త డిఫరెంట్ అని అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచింది. ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తూ.. టీమిండియాలో 3వ స్థానం.. తనకే సొంతం అని నిరూపించాడు విరాట్ కోహ్లీ.

గతంలో 113 టీ20ల్లో కోహ్లీ కేవలం 8.31 యావరేజ్‌తో ఉండగా.. దీంతో అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌ను విజయపథంలో నడిపించడానికి కోహ్లీ అవసరమా అనే టాక్ మాజీ క్రికెటర్ల నుంచి వచ్చింది. అయితే ఐసీసీ మెగా టోర్నమెంట్లకు సిద్దం కావడంలో తన పంధా డిఫరెంట్ అని కోహ్లీ నిరూపించుకుంటూ వచ్చాడు. మొన్న జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్.. 2011 ప్రపంచకప్‌లలో కోహ్లీ అత్యధిక స్కోర్ సాధించి ‘ది బెస్ట్’ అనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఫామ్ లేమితో సతమతమయ్యాడు.

ఇవి కూడా చదవండి

దీంతో స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌లకు విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఆసియా కప్పే కోహ్లీ కంబ్యాక్. ట్రోఫీ శ్రీలంక గెలిచినప్పటికీ.. మరోసారి సెలెక్టర్లకు కోహ్లీ తాను ఇన్నింగ్స్ చక్కపెట్టడంలో.. జట్టుకు కావాల్సినప్పుడు యాంకర్ రోల్ ప్లే చేయడంలో తాను ముందే ఉంటానని నిరూపించాడు. ఇక ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఇదే ప్రైమ్ ఫామ్ కంటిన్యూ చేశాడు కోహ్లీ. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ఆటతీరు కనబరుస్తూ.. టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించేందుకు ముందు వరుసలో ఉన్నాడు.(Source)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..