T20 World Cup: 3 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 208 స్ట్రైక్ రేట్‌తో 23 బంతుల్లో 48 రన్స్.. కంగారూలకే ముచ్చెమటలు
ఈ మ్యాచ్‌లో హైలెట్ అంటే రషీద్ ఖాన్ ఆడిన మెరుపు ఇన్నింగ్సే. అతను తన జట్టు తరపున అత్యధికంగా 48 పరుగులు చేశాడు. దీనికి అతను కేవలం 23 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రషీద్ 208.70 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టుకు కాసేపు ముచ్చెమటలు పట్టాయి.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో త్రుటిలో ఓటమిని తప్పించుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ ఆఫ్గాన్ పోరాట స్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది. భీకరమైన పేస్ బౌలర్లున్న ఆసీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన ఆఫ్గాన్ క్రికెటర్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హైలెట్ అంటే రషీద్ ఖాన్ ఆడిన మెరుపు ఇన్నింగ్సే. అతను తన జట్టు తరపున అత్యధికంగా 48 పరుగులు చేశాడు. దీనికి అతను కేవలం 23 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రషీద్ 208.70 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టుకు కాసేపు ముచ్చెమటలు పట్టాయి. 15వ ఓవర్ మూడో బంతికి మహ్మద్ నబీ అవుటయ్యాడు. ఆ తర్వాత రషీద్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 17వ ఓవర్ నాటికి రషీద్ 9 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. దీని తర్వాత, కేన్ రిచర్డ్‌సన్ వేసిన ఓవర్ చివరి రెండు బంతుల్లో అతను రెండు అద్భుతమైన సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనూ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఎనిమిదో స్థానంలో దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా ఆఫ్ఘనిస్థాన్ విజయానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి అవసరమయ్యాయి. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఒక ఫోర్, సిక్స్‌తో మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాడు. అయితే చివరి రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో రెండు పరుగులు రావడం.. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టినప్పటికి విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో నిరాశలో కూరుకుపోయాడు రషీద్. అయితే అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతనిని ఆస్ట్రేలియా ఆటగాళ్లు వెన్నుతట్టి అభినందించడం విశేషం.
కాగా అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ 54, మిచెల్ మార్ష్ 45, మార్కస్ స్టోయినిస్ 25 పరుగులు చేశారు. ఒకానొక దశలో ఆసీస్ 180 పరుగుల చెయ్యెచ్చని అంచనా వేసినప్పటికి చివరి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా 168 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా ఆప్ఘనిస్తాన్ పై గెలవడంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే శనివారం ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ పై ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు ఆధారపడనున్నాయి. శ్రీలంక గెలిస్తే గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది.
He almost pulled it off!
Rashid Khan has worked his magic at this #T20WorldCup ? pic.twitter.com/P9zHpR60dT
— T20 World Cup (@T20WorldCup) November 4, 2022
David Warner appreciates Rashid Khan’s innings after the match – The bond of David Warner and Rashid Khan. pic.twitter.com/HrvV3Lf2PU
— CricketMAN2 (@ImTanujSingh) November 4, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..