T20 World Cup: 29 ఏళ్ల పాక్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు.. టీ20ల్లో ‘కింగ్ మేకర్’ అయ్యాడు..

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు వరుసపెట్టి విజయాలు సాధించడానికి ముఖ్య కారణం ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్. పాక్ కెప్టెన్...

T20 World Cup: 29 ఏళ్ల పాక్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు.. టీ20ల్లో 'కింగ్ మేకర్' అయ్యాడు..
Rizwan
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:29 PM

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు వరుసపెట్టి విజయాలు సాధించడానికి ముఖ్య కారణం ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా ర్యాంకింగ్‌లో అధిగమించి వన్డేలు, టీ20లలో నెంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే మహ్మద్ రిజ్వాన్ ఇటీవల నమీబియాపై అజేయంగా 79 పరుగులు సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా టీ20 ప్రపంచకప్ అత్యధిక రన్స్ చేసిన జాబితాలో జాస్ బట్లర్(214) అగ్రస్థానంలో ఉండగా.. రిజ్వాన్ మ్యాచ్‌ల్లో 199 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బాబర్ ఆజామ్ 198 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.

విరాట్‌ను దాటేసిన రిజ్వాన్..

నమీబియాపై చేసిన 79 పరుగులతో రిజ్వాన్.. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో రిజ్వాన్ 1620 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 2016 సంవత్సరంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1614 పరుగులు చేశాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్‌ రికార్డుకు రిజ్వాన్ కేవలం 45 పరుగుల దూరంలో ఆగిపోయాడు. అలాగే రిజ్వాన్ టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ సగటులో కూడా విరాట్ కోహ్లీని అధిగమించాడు. రిజ్వాన్ సగటు 52.66 కాగా.. విరాట్ కోహ్లీ సగటు 52.01. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 50+ పరుగులు చేసిన ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. రిజ్వాన్ ఈ ఏడాది 10 సార్లు 50+ పరుగులు చేశాడు.

మరోవైపు ఈ ఏడాది టీ20ల్లో రిజ్వాన్ పరుగుల వరద పారించాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో 95.10 సగటుతో 951 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, రిజ్వాన్ తన మొదటి 15 టీ20 ఇన్నింగ్స్‌లలో ఎనిమిదిటిలో డబుల్ ఫిగర్ స్కోర్లను దాటలేదు. 17 ఇన్నింగ్స్‌ల తర్వాతే తొలి అర్ధ సెంచరీని నమోదు చేసుకోవడం గమనార్హం. కాగా, బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి ఓపెనర్లుగా అద్భుత రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??