IPL 2023: 6 మ్యాచుల్లో 4 డకౌట్లు.. అయినా ఐసీసీ ర్యాం ‘కింగ్‌’ సూర్య నే.. ఎందుకో తెలుసా?

ఈ ఏడాది మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు సూర్య. పరుగులు చేయడం సంగతి పక్కన పెడితే వరుస డకౌట్లతో చెత్త రికార్డులు ఖాతాలో వేసుకుంటున్నాడు. వన్డే, టీ20, ఐపీఎల్‌ ఇలా అన్ని ఫార్మాట్లలోనూ దారుణంగా విఫలమవుతున్నాడీ స్టార్‌ ప్లేయర్‌.

IPL 2023: 6 మ్యాచుల్లో 4 డకౌట్లు.. అయినా ఐసీసీ ర్యాం 'కింగ్‌' సూర్య నే.. ఎందుకో తెలుసా?
Suryakumar Yadav
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2023 | 12:16 PM

సూర్యకుమార్ యాదవ్‌.. సెన్సేషనల్‌ బ్యాటింగ్‌తో తెరమీదకు వచ్చిన ఈ స్టార్‌ బ్యాటర్‌ గతేడాది పరుగుల వరద పారించాడు. అటు అంతర్జాతీయ మ్యాచుల్లోనూ, ఐపీఎల్‌లోనూ ధనాధాన్‌ ఇన్నింగ్స్‌ లు ఆడాడు. మైదానంలో నలువైపులా షాట్లు కొడుతూ ‘మిస్టర్‌ 360 ‘ అని ప్రశంసలు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో నెంబర్‌ వన్‌ ఆటగాడిగా ఐసీసీ మెప్పు కూడా పొందాడు. అయితే ఈ ఏడాది మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు సూర్య. పరుగులు చేయడం సంగతి పక్కన పెడితే వరుస డకౌట్లతో చెత్త రికార్డులు ఖాతాలో వేసుకుంటున్నాడు. వన్డే, టీ20, ఐపీఎల్‌ ఇలా అన్ని ఫార్మాట్లలోనూ దారుణంగా విఫలమవుతున్నాడీ స్టార్‌ ప్లేయర్‌. దీంతో అతనిని జట్టు నుంచి తొలగించాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ధనాధన్‌ లీగ్‌లో దారుణంగా విఫలమవుతోన్న సూర్యకుమార్ కు కాస్త ఉపశమనం లభించే వార్త ఒకటి వచ్చింది. అదేంటంటే.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాకింగ్స్‌లో మరోసారి మిస్టర్‌ 360 ప్లేయర్‌కే అగ్రస్థానం దక్కింది. బ్యాటింగ్‌ విభాగంలో మొత్తం 906 రేటింగ్‌ పాయింట్లతో తన మొదటి ర్యాంక్‌ను కాపాడుకున్నాడు.

సూర్యకుమార్‌ యాదవ్ తర్వాత పాక్ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(811 పాయింట్లు), పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(755 పాయింట్లు), సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (748 పాయింట్లు), న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే(745పాయింట్లు) ఉన్నారు. ఇక ఇదే జాబితాలో టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లి 15వ స్థానంలో ఉన్నారు. సూర్య, విరాట్‌ మినహా మిగతా టీమిండియా బ్యాటర్లు ఎవరు టాప్‌-20లో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే వరుసగా విఫలమవుతున్నా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్య నెంబర్‌.1 స్థానంలో కొనసాగాడానికి కారణం.. అంతర్జాతీయంగా టీ20 మ్యాచ్‌లు జరగకపోవడమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై