IPL 2023: చెన్నైకు బిగ్ షాక్.. కెప్టెన్ ధోనికి గాయం.. తర్వాతి మ్యాచ్ ఆడడంపై హెడ్ కోచ్ ఏమన్నారంటే?
176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆఖరి వరకు క్రీజులో ఉండడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టుగానే కేవలం 17 బంతుల్లోనే 32 పరుగుల ధనాధాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్-2023లో భాగంగా గురువారం (ఏప్రిల్12) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని సేను కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆఖరి వరకు క్రీజులో ఉండడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టుగానే కేవలం 17 బంతుల్లోనే 32 పరుగుల ధనాధాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే చెన్నై విజయానికి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. ధోని సింగిల్ మాత్రమే తీయడంతో సీఎస్కేకు పరాజయం తప్పలేదు. కాగా ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ షాక్ తగిలేలా ఉంది. కెప్టెన్ ఎంఎస్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయంపై మాట్లాడాడు.
‘ధోని ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అందుకే మైదానంలో పరుగులు తీసేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. రెండు పరుగుల రావల్సిన సందర్భాల్లో కేవలం సింగిల్ మాత్రమే తీయగలిగాడు. ప్రస్తుతం మా వైద్య బృందం ధోనీని పర్యవేక్షిస్తోంది. మా తర్వాతి మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. కాబట్టి అప్పటిలోపు ధోని కోలుకోంటాడని ఆశిస్తున్నాము. ధోని ఫిట్‌నెస్‌కు ఎలాంటి వంక పెట్టడానికి లేదు. టోర్నీ ప్రారంభానికి ముందే జట్టుతో కలిస ప్రాక్టీస్‌ను మొదలెట్టాడు. అతనిలో కొంచెం కూడా జోరు తగ్గలేదు. ధోని అద్భుతమైన ఆటగాడు’ అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ధోని గాయంపై సీఎస్కే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక సీఎస్‌కే తమ తర్వాతి మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడనుంది. ఏప్రిల్ 17న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
??????? ???? ?
Rewind Dhoni’s late blitz from #CSKvRR & keep watching #IPLJioCinema ?#TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/k09CU93AC5
— JioCinema (@JioCinema) April 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..