IND vs SA 2nd Test: భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఎప్పుడు?, ఎక్కడ? పూర్తి సమాచారం ఇదిగో..
When and Where to Watch India Vs South Africa Test: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత భారత్ రెండో టెస్టుకు సిద్ధమైంది. టీమ్ ఇండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. కాబట్టి, భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ ఎప్పుడు?, ఎక్కడ?, ఎప్పుడు? జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
When and Where to Watch India Vs South Africa Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (India vs South Africa) తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది . సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో మూడు రోజుల వ్యవధిలో ముగిసిన మ్యాచ్‌లో, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్ పేలవమైన ప్రదర్శన చేశారు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్టులో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో టెస్టుపై ఇరు జట్లూ కన్నేశాయి. భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ ఎప్పుడు?, ఎక్కడ?, ఎప్పుడు? జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3, 2024 నుంచి 7 వరకు జరగనుంది.
భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.
భారత్-దక్షిణాఫ్రికా 2వ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ చూడాలి?
ఇండియా vs దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ IST మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.
టెస్ట్ సిరీస్ కోసం రెండు జట్లు:
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, అవేష్ ఖాన్.
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు: డేవిడ్ బెడింగ్‌హామ్, ఆండ్రీ బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జార్జ్, డీన్ ఎల్గర్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, లుంగి న్గిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్ రబాడా, కైల్ వెర్న్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..