Test Cricket: డబుల్ సెంచరీలతో దుమ్మురేపిన క్రికెటర్లు.. టెస్ట్ ఫార్మాట్‌లో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
Most Double Centuries in Test Cricket: టెస్ట్ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయడం కూడా ఒక పెద్ద అచీవ్‌మెంట్. ఇప్పటి వరకు చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఈ ఫీట్ సాధించారు. అయితే, ఎక్కువ సంఖ్యలో డబుల్ సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసా? టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీల పరంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ ముందున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Most Double Centuries in Test Cricket: టెస్ట్ మ్యాచ్‌లలో సత్తా చాటితేనే అసలైన క్రికెట్ ఆటగాడు అని చెబుతుంటారు. ఈ ఫార్మాట్‌లో అంకితభావం, సహనం ఎంతో అవసరం. ఇది ప్రతి ఆటగాడికి ఇందులో సక్సెస్ కాలేడు. టెస్ట్ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ దీనిని సద్వినియోగం చేసుకోరు. కొందరు మాత్రమే, ఇందులో విజయాలను అందుకుంటుంటారు.
టెస్ట్ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేయడం కూడా ఒక పెద్ద అచీవ్‌మెంట్. ఇప్పటి వరకు చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఈ ఫీట్ సాధించారు. అయితే, ఎక్కువ సంఖ్యలో డబుల్ సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీల పరంగా ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ ముందున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
3. బ్రియాన్ లారా (9)..
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతను తన 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో తొమ్మిది డబుల్ సెంచరీలు సాధించాడు. 1993లో తన తొలి టెస్టు సెంచరీని డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. దీని తర్వాత లారా 1994లో ఇంగ్లండ్‌పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మళ్లీ డబుల్ సెంచరీ చేయడానికి ఐదేళ్లు పట్టింది. కానీ, 1999 నుంచి 2003 వరకు నాలుగు డబుల్ సెంచరీలు బాదేశాడు.
2004 సంవత్సరంలో అతను ఇంగ్లండ్‌పై 400 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. 2005లో, బ్రియాన్ లారా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 226 పరుగులు చేశాడు. ఆపై 2006లో ముల్తాన్‌లో 216 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
2. కుమార్ సంగక్కర (11)..
శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర ఆసియా బ్యాట్స్‌మెన్లలో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. అతను లాహోర్‌లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. బులవాయోలో జింబాబ్వేపై 270 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికాపై 232 పరుగులు చేసిన వెంటనే సంగక్కర స్వదేశంలో తన మొదటి 200+ స్కోరును నమోదు చేశాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికాపై 287 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
2007లో బంగ్లాదేశ్‌తో ఆడుతున్నప్పుడు, శ్రీలంక మాజీ కెప్టెన్ కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. జులై 2010లో భారత్‌పై అతని ఏడో డబుల్ సెంచరీ సాధించాడు.
2011లో పాకిస్థాన్‌పై ఎనిమిదో డబుల్ సెంచరీ సాధించాడు. సంగక్కర ఫిబ్రవరి 2014లో బంగ్లాదేశ్‌పై తన అత్యధిక టెస్ట్ స్కోరు (319 పరుగులు) సాధించాడు. ఆ తర్వాత అతను పాకిస్థాన్‌పై డబుల్ సెంచరీ సాధించగా, 2015లో న్యూజిలాండ్‌పై తన టెస్ట్ కెరీర్‌లో చివరి డబుల్ సెంచరీని సాధించాడు.
1. సర్ డాన్ బ్రాడ్‌మాన్ (12)..
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డు సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. అతను కేవలం 52 టెస్టుల్లో 12 డబుల్ సెంచరీలు చేశాడు. బ్రాడ్‌మాన్ 1930 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై మూడు డబుల్ సెంచరీలు సాధించగా, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బ్రాడ్‌మాన్ 223 పరుగులు చేశాడు.
ఆ తర్వాత అతను దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ దిగ్గజ ప్లేయర్ 1934 యాషెస్ సిరీస్‌లో నాల్గవ, ఐదవ టెస్టుల సమయంలో తన ఏడో, ఎనిమిదో డబుల్ సెంచరీలను సాధించాడు. ఇంగ్లండ్ జట్టు బ్రాడ్‌మాన్‌కి ఇష్టమైన ప్రత్యర్థి. తదుపరి టెస్టుల్లో ఇంగ్లండ్‌పై మరో మూడు డబుల్ సెంచరీలు చేశాడు.
1948లో, బ్రాడ్‌మాన్ భారత జట్టుపై తన టెస్ట్ కెరీర్‌లో 12వ డబుల్ సెంచరీని సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ రికార్డు సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




